Begin typing your search above and press return to search.
సుమంత్ సెట్స్ నుంచి వెళ్లిపోయిన వేళ..
By: Tupaki Desk | 1 Nov 2016 6:08 AM GMTఫలానా హీరో కోపంతో షూటింగ్ మధ్యలో సెట్స్ నుంచి వెళ్లిపోయాడంటూ ఇండస్ట్రీలో వార్తలు రావడం మామూలే. ఐతే ఇలాంటి రూమర్ల గురించి స్పందించడానికి ఎవరూ ఇష్టపడరు. ఐతే సుమంత్ మాత్రం తన గురించి వచ్చిన ఇలాంటి వార్తలపై స్పందించాడు. తాను ‘నరుడా డోనరుడా’ సెట్స్ నుంచి ఒకట్రెండుసార్లు వాకౌట్ చేసినట్లు వస్తున్న వార్తలు నిజమే అన్నాడు. ఐతే అవి పెద్ద ఇష్యూస్ కావని చెప్పాడు. ‘‘అవును.. నేను నరుడా డోనరుడా సెట్స్ నుంచి వాకౌట్ చేసిన మాట వాస్తవం. కానీ సీరియస్ కారణాలతో మాత్రం కాదు’’ అని సుమంత్ చెప్పాడు. కొన్ని సన్నివేశాల విషయంలో కోపం వచ్చి సుమంత్ షూటింగ్ నుంచి వెళ్లిపోయాడని.. ఆ తర్వాత అన్నీ సర్దుకున్నాయని ‘నరుడా డోనరుడా’ యూనిట్ వర్గాలు తెలిపాయి.
ఇక ‘నరుడా డోనరుడా’ కోసం తొలిసారి ప్రొడక్షన్ వ్యవహారాలన్నీ తనే చూసుకోవడం గురించి సుమంత్ స్పందిస్తూ.. ‘‘నరుడా డోనరుడాకు నా చెల్లెలు సుప్రియ నిర్మాత. ఐతే తను స్టూడియో వ్యవహారాలతో బిజీగా ఉంటుంది. దీంతో ప్రొడక్షన్ వ్యహారాలన్నీ నేనే చూసుకోవాల్సి వచిచంది. కొన్నిసార్లు అంతా బాగానే అనిపిస్తుంది. కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తుతాయి. సినిమాలో నటిస్తూ.. ప్రొడక్షన్ వ్యవహారాలు కూడా చూసుకోవడం కష్టమైంది. అయినప్పటికీ ఈ అనుభవంతో చాలా విషయాలు నేర్చుకున్నాను’’ అన్నాడు. ‘విక్కీ డోనర్’కు రీమేక్ గా తెరకెక్కిన ‘నరుడా డోనరుడా’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. కొత్త దర్శకుడు మల్లిక్ రామ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/