Begin typing your search above and press return to search.

విలన్ పాత్రలు ఇవ్వరేంటని ఫీలవుతున్నాడు

By:  Tupaki Desk   |   3 Nov 2016 10:30 PM GMT
విలన్ పాత్రలు ఇవ్వరేంటని ఫీలవుతున్నాడు
X
విలన్ పాత్రలు చేసే వాళ్లకు హీరోలు కావాలని ఉంటుంది. కానీ హీరోలకు విలన్ పాత్రలపై మనసు మళ్లడం అరుదు. సుమంత్ మాత్రం ఈ దిశగానే ఆలోచిస్తున్నాడు. విలన్ పాత్రల విషయంలో తాను చాలా సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నాడు. ఐతే ఈ విషయం చాన్నాళ్ల నుంచి చెబుతున్నా ఎవరూ తనను పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని సుమంత్ చెప్పాడు. ‘‘నాకు దుర్యోధనుడు.. రావణాసురుడు లాంటి పాత్రలు.. లేదా ఆ ఛాయలున్న సోషల్ రోల్స్ చేయాలని ఉంది. నెగెటివ్ రోల్స్ కు నేను రెడీ అని ఇంతకుముందే చెప్పాను. కానీ అలాంటి పాత్రలతో నన్నెవరూ సంప్రదించడం లేదు. నెగెటివ్ పాత్రలతో ఉండే కిక్కే వేరు. రజినీకాంత్ గారు.. మోహన్ బాబు గారు ముందు నెగెటివ్ రోల్స్ చేసే ఆ తర్వాత హీరోలయ్యారు కదా’’ అని సుమంత్ అన్నాడు.

ఇక తన కొత్త సినిమా ‘నరుడా డోనరుడా’ గురించి సుమంత్ చెబుతూ.. ‘‘ఇది అందరూ అనుకుంటున్నట్లు అడల్ట్ మూవీ కాదు. అలా అయితే సెన్సార్ వాళ్లు ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చేవాళ్లు. ‘యు/ఎ’ ఇచ్చేవాళ్లు కాదు. యూత్ మాత్రమే కాదు.. అందరూ చూడదగ్గ సినిమా ఇది. యూనివర్శల్ కాన్సెప్ట్. సినిమా బోల్డ్ గా ఉంటుంది కానీ.. వల్గారిటీ.. అడల్ట్ కంటెంట్ ఉండదు. ‘విక్కీ డోనర్’ కంటే కూడా ఓ అడుగు ముందుకేసి మరింత బోల్డ్ గా తెరకెక్కించాం. బోల్డ్ కాన్సెప్ట్ ను అందరూ మెచ్చుకునే రీతిలో తెరకెక్కించాం. హిందీలో ఈ సినిమాను మల్టీపెక్స్ ఆడియన్స్ మాత్రమే కాదు.. అందరూ ఆదరించారు. తెలుగులోనూ అలాగే జరుగుతుందని అనుకుంటున్నా’’ అని సుమంత్ తెలిపాడు. ‘నరుడా డోనరుడా’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/