Begin typing your search above and press return to search.

చిట్టిబాబు.. భరత్.. సూర్య.. వావ్

By:  Tupaki Desk   |   26 Jan 2018 6:30 PM GMT
చిట్టిబాబు.. భరత్.. సూర్య.. వావ్
X
ప్రయోగాలతో కూడా బాక్స్ ఆఫీస్ లు బద్దలువతాయని మన హీరోలు ఈ చాలా కాలం తరువాత మద్యే జనాలకు అలవాటు చేయడం మొదలు పెట్టారు. అలాగే కొంచెం భవిష్యత్తు తరాలకు బాటలు కూడా వేస్తున్నారు. ముఖ్యంగా మంచి మెసేజ్ లు ఉన్న కథలను ఎంచుకుంటూ బాధ్యతగా సినిమాలను చేస్తున్నారు. అయితే 2018 టాలీవుడ్ కి స్పెషల్ ఇయర్ కాబోతోంది అని ఓ ముగ్గురు హీరోలు వారి సినిమాలతో నిరూపించబోతున్నారు.

ఒకరు సీఎం అయితే మరొకరు ఆర్మీ ఆఫీసర్. ఇక వారికంటే కొంచెం డిఫెరెంట్ గా ఒక స్టార్ హీరో పల్లెటూరి యువకుడి లా కనిపించబోతున్నాడు. వారెవరో ఇప్పటికే అర్ధమయ్యి ఉంటుంది. ముందుగా చిట్టి బాబుగా రంగస్థలం అనే ఊరిలో మెగా పవర్ స్టార్ మట్టి మనిషిలా కనిపించడానికి రెడీ అవుతున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో చరణ్ చెవిటివాడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఆ తరువాత భరత్ వర్సెస్ సూర్య వార్ కొనసాగనుంది. మహేష్ మొదటి సారి పూర్తిగా ఒక రాజకీయ నేపథ్యం ఉన్న భరత అనే నేను సినిమాలో ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడు. ఆ సినిమా పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అందరికి తెలిసిందే.

ఇక ఫస్ట్ ఇంపాక్ట్ తో నరాలు తెగేలా ఆకర్షించిన అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ గా నా పేరు సూర్య సినిమా ద్వారా కనిపించబోతున్నాడు. మొత్తంగా చిట్టి బాబు - భరత్ - సూర్య లుగా మన స్టార్ హీరోలు సమ్మర్ లో విజిల్స్ వేయించనున్నారు. మరి ఎవరు ఏ స్థాయిలో కలెక్షన్స్ ని అందుకుంటారో చూడాలి.