Begin typing your search above and press return to search.
టాప్ స్టోరి: వేసవి రిలీజ్ ల సీనెంత?
By: Tupaki Desk | 15 Feb 2019 1:30 AM GMTవాతావరణంలో మార్పు స్పష్టంగా తెలుస్తోంది. రానున్నది సమ్మర్. ఈ ఏడాది చలి పెరిగినట్టే ఎండలు మండేట్టే కనిపిస్తోంది. అంత మంట పుట్టించే ఎండల్లో ఏసీ థియేటర్లలో కూల్ చేసే సినిమాలు ఏవి వస్తున్నాయ్? మార్చి మొదలు ఏప్రిల్‌లో ఎలాంటి సినిమాలు రిలీజ్ లకు వస్తున్నాయ్? అన్నది పరిశీలిస్తే.. ఆసక్తికర సంగతులివిగో...
మార్చి మొదలు ఏప్రిల్ ఎండింగ్ వరకూ ఓ డజను సినిమాలు రిలీజ్ లకు రెడీ అవుతున్నాయి. వీటిలో ఒకే ఒక్కటి స్టార్ హీరో నటించిన భారీ సినిమా. ఇతర సినిమాలన్నీ మీడియం బడ్జెట్ చిత్రాలే. ఇప్పటికే ప్రతిపాదించిన రిలీజ్ తేదీల వివరాల్లోకి వెళితే.. మార్చి 1- ఎబిసిడి - మార్చి 5- మజిలీ - మార్చి 29 - 118 - మార్చి 29- సూర్య కాంతం - ఏప్రిల్ 12- చిత్రలహరి - ఏప్రిల్ 12- ఎన్జీకే - ఏప్రిల్ 18- కాంచన 3 - ఏప్రిల్ 19 - జెర్సీ - ఏప్రిల్ 25 - మహర్షి చిత్రాలు రిలీజ్ లకు రానున్నాయి. వీటితో పాటే మరిన్ని చిన్న సినిమాలు రిలీజ్ లకు రానున్నాయి. అయితే స్కూల్స్ - కాలేజ్ లకు మార్చి- ఏప్రిల్ పబ్లిక్ పరీక్షల సీజన్ కాబట్టి సినిమాల రాక తక్కువే ఉంది. మార్చిలో సినిమాల విడుదల అంతంత మాత్రమే. ఏప్రిల్ లోనూ కొంత కష్టమే అయినా.. ఈసారి ఏప్రిల్ లో ఓ అరడజను చిత్రాలు కాస్త క్రేజీగానే విడుదలకు సిద్దమవుతున్నాయి. ఏప్రిల్ ఆరంభంలోనే నాగచైతన్య- మజిలి రిలీజవుతోంది. ఆ తర్వాత సాయిధరమ్ -చిత్రలహరి - సూర్య- ఎన్జీకే చిత్రాలు ఒకే రోజు విడుదల చేస్తున్నారు. ఈ రెండు సినిమాలకు ఇప్పటికే ఏప్రిల్ 12 తేదీని లాక్ చేశారు. వీటికి తోడు నాని నటిస్తున్న జెర్సీ - లారెన్స్ మాస్టర్- కాంచన 3 ఒకరోజు గ్యాప్ తో(18 - 19 తేదీలు)నే వరుసగా రిలీజవుతున్నాయి. వాస్తవానికి ఈరెండు చిత్రాల్ని మొదట ఏప్రిల్ 19న విడుదల చేయాలని భావించారు. అయితే చిన్నపాటి మార్పులతో రిలీజ్ ప్లాన్ చేశారని తెలుస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ హీరోగా `మహర్షి` ఈ సమ్మర్ లో భారీ అంచనాల నడుమ రిలీజవుతోంది. ఇప్పటికే షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. సినిమా పై అంచనాలు పతాక స్థాయిలో ఉన్నాయి. `భరత్ అనే నేను` బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ నటిస్తున్న సినిమా కాబట్టి.. క్రేజీగా భారీ ఎత్తున `మహర్షి` చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. మహర్షి కోసం ఇప్పటికే దాదాపుగా 80 శాతం థియేటర్లను బ్లాక్ చేశారని తెలుస్తోంది. మరి ఈ సీజన్ లో వస్తున్న సినిమాల్లో ఎవరి సత్తా ఎంత? అన్నది వేచి చూడాల్సిందే.