Begin typing your search above and press return to search.
బ్రేకింగ్: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ స్టార్స్ కు ఈడీ సమన్లు..!
By: Tupaki Desk | 25 Aug 2021 2:44 PM GMTటాలీవుడ్ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. మాదకద్రవ్యాల కేసులో ఈసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. దీనిలో భాగంగా విచారణకు హాజరుకావాలని పలువురు సినీ ప్రముఖులకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఇందులో స్టార్ హీరో హీరోయిన్లు, అగ్ర దర్శకులతో సహా పన్నెండు మంది వరకు వున్నారని తెలుస్తోంది
ఇందులో పూరీ జగన్నాథ్ - ఛార్మి కౌర్ - రానా దగ్గుబాటి - రవితేజ - తరుణ్ - నవదీప్ - ముమైత్ ఖాన్ - నందు - రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ ల పేర్లు ఉన్నట్లు కథనాలను వెలువడుతున్నాయి. పూరీని ఆగస్ట్ 31న - సెప్టెంబర్ 8న రానా - సెప్టెంబర్ 9న రవితేజ - నవంబర్ 15న ముమైత్ ఖాన్ విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ నోటీసులో పేర్కొన్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.
కాగా, 2017 జులై 2న తెలంగాణ ఎక్సైజ్ ప్రొహిబిషన్ పోలీసులు డ్రగ్స్ కేసు నమోదు చేశారు. టాలీవుడ్ లోని అనేక మంది ప్రముఖులు డ్రగ్స్ వినియోగిస్తున్నారని.. డ్రగ్స్ డీలర్లతో సంబంధాలు కలిగి ఉన్నారని పోలీసులు వెల్లడించారు. డ్రగ్స్ వ్యవహారంపై ఎక్సైజ్ చీఫ్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసి పలువురు సెలబ్రిటీలతో పాటుగా సాఫ్టువేర్ ఇంజినీర్స్ - వ్యాపారస్తులను కూడా విచారించారు. దీనిపై దాదాపు 12 కేసులు నమోదు చేయగా.. 11 ఛార్జ్ షీట్లను ఫైల్ చేశారని తెలుస్తోంది.
టాలీవుడ్ సెలబ్రిటీలు డ్రగ్స్ కేసులో విచారణకు హాజరవడం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే అనేక మందిని విచారించిన పోలీసులు.. ఈ కేసులో సరైన సాక్ష్యాలు లేకపోవడంతో సినీ ప్రముఖులనెవరినీ అరెస్టు చేయలేదు. ఇన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్న ఈ కేసు.. ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈడీ ఈ కేసులో రంగంలోకి దిగడంతో తదుపరి చర్యలపై అందరిలో ఉత్కంఠ నెలకొంది.