Begin typing your search above and press return to search.
C/o పాజిటివ్ రివ్యూస్.. కాని..
By: Tupaki Desk | 9 Nov 2017 5:09 AM GMTఅసలు దర్శకుడు సుసీంద్రన్ సినిమా అంటేనే.. సినిమా మొదట్లో కాస్త స్లోగా అనిపిస్తుంది కాని.. ఆయన అందించే ట్విస్టులు.. అలాగే ఎమోషన్ భలే పీక్స్ లో ఉంటుంది. 'నా పేరు సూర్య' 'పల్నాడు' వంటి సినిమాలను చూస్తే ఆ విషయం అర్దమవుతుంది. ఇకపోతే గత కొంతకాలంగా హిట్ కోసం ఉవ్విళ్ళూరుతున్న కుర్ర హీరో సందీప్ కిషన్ తో ఇప్పుడు ఆయన 'C/o సూర్య' అనే సినిమాను తీశారు. ఈ సినిమాతో ఇద్దరూ కూడా తెలుగునాట హిట్టు కొట్టాలని చూస్తున్నారు.
విషయం ఏంటంటే.. ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా తాలూకు తమిళ ప్రీమియర్ ను చెన్నయ్ లో వేశారు. ఇక సినిమాను చూసిన తమిళ జర్నలిస్టులు మాత్రం.. అబ్బా సూపర్ అంటూ ట్విట్టరుకెక్కి నానా హంగామా చేస్తున్నారు. విపరీతమైన పాజిటివ్ గా రివ్యూస్ రావడంతో.. సందీప్ అండ్ సుసీంద్రన్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే తెలుగులో కూడా ఇలాంటి రివ్యూస్ వస్తే బాగానే ఉంటుంది. కాని ఇక్కడో మరో చిక్కొచ్చింది.
ఈ శుక్రవారం తెలుగులో ఒక్కడు మిగిలాడు అనే మరో తెలుగు సినిమాతో పాటు.. విజయ్ అదిరింది.. విశాల్ డిటెక్టివ్ కూడా రిలీజవుతున్నాయి. ఎలా చూసినా కూడా ధియేటర్ల కొరత అయితే ఉంది. కాబట్టి రివ్యూలు గట్టిగా వచ్చినా కలక్షన్లు తక్కువొచ్చే ప్రమాదం ఉందంటున్నారు ట్రేడ్ పండితులు.