Begin typing your search above and press return to search.
రిజల్ట్ చూసి అలెర్టయిన యంగ్ హీరో.. నెక్ట్స్ ఏంటి?
By: Tupaki Desk | 14 March 2021 5:30 PM GMTక్రీడా నేపథ్యం ఉన్న సినిమాల హవా కొనసాగుతోంది. క్రీడాకారుల బయోపిక్ లు ఘనవిజయం సాధించిన నేపథ్యంలో చాలా మంది స్పోర్ట్స్ నేపథ్యంలో కథల్ని ఎంచుకుని ప్రయోగాలు చేస్తున్నారు. ఆడియెన్ లో స్పోర్టింగ్ స్పిరిట్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. అదే కోవలో ఇంతకుముందు గౌతమ్ తిన్ననూరి- నాని బృందం జెర్సీ లాంటి క్లాసిక్ మూవీని తెరకెక్కించారు. ఇపుడు టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఏ1 ఎక్స్ ప్రెస్ అనే చిత్రంలో నటించాడు.
హాకీ నేపథ్యంలోని ఈ మూవీలో కమర్షియల్ హంగులు కటింగులు అవసరానికి మించాయని క్రిటిక్స్ వైపు నుంచి విమర్శలొచ్చాయి. కారణం ఏదైనా ఫలితం ఆశించినట్టు రాకపోవడం యువహీరోని నిరాశపరిచిందని తెలిసింది.
రిజల్ట్ నెగిటివ్ గా రావడంతో ఇప్పడు సందీప్ తదుపరి సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సందీప్ డ్యామేజ్ కంట్రోల్ కోసం తాపత్రాయ పడుతున్నారని.. హీరోగా.. నిర్మాతగా కూడా నష్టాల నుంచి బయటపడడం ఎలా అన్నది వేచి చూస్తున్నాడని గుసగుస వినిపిస్తోంది.
ఏ సెంటర్ లో కూడా ఏ1 ఎక్స్ ప్రెస్ చిత్రానికి రిలీజైన రోజు మ్యాట్నీ నుంచి సరైన కలెక్షన్స్ రాలేదు. ఇది తెలుసుకున్న సందీప్ ఇప్పుడు తన అప్ కమింగ్ సినిమాలు మీద కంటెంట్ విషయంలో కాన్సన్ ట్రేషన్ పెట్టారని.. ఇకపై ఎలాంటి పొరపాటు లేకుండా ముందుకు సాగేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.