Begin typing your search above and press return to search.

ఆ కుర్ర హీరో అందుకు ఒప్పుకోలేదా?

By:  Tupaki Desk   |   9 Nov 2017 4:20 AM GMT
ఆ కుర్ర హీరో అందుకు ఒప్పుకోలేదా?
X
తెలుగు సినీ పరిశ్రమకు, తమిళ చిత్ర పరిశ్రమకు చాలా తేడాలు ఉంటాయి. చాలా లో బడ్జెట్ సినిమాలు కూడా తమిళంలో.. ఎలాంటి గ్లామర్ జోడింపులు - బోల్డ్ అడల్ట్ - డార్క్ మేకింగ్ లేకపోయినా సరే.. విజయం సాధిస్తూ ఉంటాయి. అలాగే సినిమా టైటిల్స్ విషయంలో కూడా తమిళంలో చాలా క్రియేటివ్ ఎలిమెంట్ తో టైటిల్స్ ఉంటాయి అని అందరూ అంటూ ఉంటారు. ఈ విషయం తాజాగా మంచి ఉదాహరణ తో మనకు అర్థం అవుతోంది.

సందీప్ కిషన్ హీరోగా చక్రి చిగురుపాటి నిర్మించిన చిత్రం కేరాఫ్ సూర్య. ఈ చిత్రాన్ని దర్శకుడు సుశీంద్రన్ ఉభయ భాషా చిత్రంగా రూపొందించారు. ఈ చిత్రానికి తమిళంలో ‘నేంజిల్ తురివిరుందాల్’ అని టైటిల్ పెట్టారు. తమిళం మనకు అర్థం కాకపోయినప్పటికీ.. తెలుగులో సింపుల్ గా ‘కేరాఫ్ సూర్య’ అని ఉంటే తమిళంలో అంత పొడుగ్గా ఉన్నదేమిటా అని అనుమానం కలుగుతుంది. ‘నేంజిల్ తురివిరుందాల్’ అంటే హృదయాన్ని ఛిద్రం చేయం అని అర్థం. చాలా భావంతో , ఫీల్ తో అక్కడ టైటిల్ పెట్టారన్నమాట.

అలాంటి ఫీల్ ఉన్న టైటిల్ ను తెలుగులో పెట్టడానికి హీరో సందీప్ కిషన్ ఒప్పుకోలేదని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. ఎందుకంటే.. తెలుగు చిత్ర పరిశ్రమ హీరో ఓరియెంటెడ్ గా ఉంటుంది. ఎంత గొప్ప కథ అయినా.. హీరో పేరు మీద టైటిల్ ఉండడం అనేది ఇక్కడ ఒక సాంప్రదాయం. దానికి భిన్నంగా వెళితే.. హీరోగా ఇమేజి పడిపోతుందని కథానాయకులు ఓ భ్రమలో బతుకుతుంటారు. బహుశా కుర్ర హీరో సందీప్ కిషన్ కూడా.. అందుకే సినిమా టైటిల్ తన పేరు మీద ఉండాలని కోరాడేమో అని అంతా అనుకుంటున్నారు. తమిళంలో ‘హృదయం ఛిద్రం కావడం’ అని అర్థమిచ్చే ఫీల్ ఉన్న టైటిల్ తో వస్తున్న సినిమా - తెలుగులో ‘కేరాఫ్ సూర్య’ అంటూ యాక్షన్ ఇంప్రెషన్ తో రాబోతోంది. రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం మరి.