Begin typing your search above and press return to search.

కుర్రాడిని నగరం ఏం చేస్తుందో?

By:  Tupaki Desk   |   7 March 2017 5:54 AM GMT
కుర్రాడిని నగరం ఏం చేస్తుందో?
X
సందీప్ కిషన్ నటించిన 'నగరం' మూవీ ఈ నెల 10న రిలీజ్ కాబోతోంది. తమిళ్ లో 'మానగరం' అనే టైటిల్ పై రూపొందిన ఈ చిత్రాన్ని.. తెలుగులో నగరం పేరుతో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ తమిళ్ వెర్షన్ ను స్పెషల్ ప్రీమియర్ గా ప్రదర్శించారు.

ఇటు తెలుగు ట్రైలర్ విడుదల చేయడం.. అటు తమిళ్ లో ప్రీమియర్ షోకి రియాక్షన్.. దాదాపు ఒకేసారి వచ్చాయి. ట్రైలర్ ఆకట్టుకుంటోందనే టాక్ తో పాటు.. సినిమాకి మంచి రివ్యూలు వస్తున్నాయి. ఈ దెబ్బతో తెగ యాక్టివ్ అయిపోయిన సందీప్ కిషన్.. ఈ మూవీపై.. ట్రైలర్ పై పాజిటివ్ గా వచ్చిన ట్వీట్స్ అన్నిటినీ.. రీట్వీట్ చేస్తున్నాడు. ప్రముఖులా కాదా.. ఫేమస్ పర్సనాలిటీస్ అవునా కాదా అని కూడా చూడకుండా.. తెగ రీట్వీట్స్ పెట్టేస్తున్నాడు.

చాలా రోజుల తర్వాత బాగుందనే టాక్ వచ్చేసరికి సందీప్ కిషన్ సంతోషం పట్టలేకపోతోన్నాడనే చెప్పాలి. అది సరే కానీ.. ఒక టైంలో రైజింగ్ స్టార్ అనిపించుకున్న ఈ కుర్ర హీరో.. వరుసగా తగిలిన దెబ్బల ప్రభావంతో ఫ్లాప్ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు నగరం సినిమాలో కూడా ఇదే రేంజ్ ఎగ్జైట్మెంట్ ఉంటే.. సినిమా ఆదరణ పొందే అవకాశాలు ఎక్కువే. మరి నగరంతో అయినా సందీప్ కిషన్ కి ఆశించిన బ్రేక్ వస్తుందో లేదో తెలియాలంటే.. 10వ తేదీ వరకూ ఆగాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/