Begin typing your search above and press return to search.
ఆ హీరో 20 నిమిషాలు ఏడ్చాడట
By: Tupaki Desk | 11 March 2017 5:08 PM GMTటాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కొన్ని రోజుల కిందట ఆపకుండా 20 నిమిషాలు ఏడ్చాడట. అలాగని అతడికి ఇప్పుడేమీ కష్టాలు వచ్చి పడిపోలేదు. ఇవి ఆనందంలో వచ్చిన కన్నీళ్లట. ఈ కన్నీళ్లకు కారణం తన కొత్త సినిమా ‘మానగరం’ (తెలుగులో నగరం) అంటున్నాడతను. ఇంతకీ ఆ కన్నీళ్ల కథేంటో సందీప్ మాటల్లోనే తెలుసుకుందాం పదండి.
‘‘నా నుంచి చెప్పుకోదగ్గ సినిమా వచ్చి రెండేళ్లయింది. 2015లో ‘టైగర్’ సినిమాకు మంచి పేరొచ్చింది. సినిమా బాగానే ఆడింది. ‘బీరువా’ కూడా పర్వాలేదు. కానీ ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ తరహాలో సాలిడ్ హిట్ అయితే రాలేదు. ఇక గత ఏడాది నేను చేసిన రెండు సినిమాలూ ఆడలేదు. హిట్.. ఫ్లాప్ అన్నది సంబంధం లేకుండా నేను నా స్టయిల్లో వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాను. ఐతే గత ఏడాది నా సినిమాలు రెండూ ఫ్లాపవడంతో నా మీద నాకే డౌట్లొచ్చేశాయి. నేను ఎటు వెళ్తున్నానో అనే సందేహాలు తలెత్తాయి. దీనికి తోడు ఆ సినిమాలు ఫెయిలైనపుడు కొందరు నాతో ఎలా ప్రవర్తించారో నాకు తెలుసు. ఎవరేంటో నాకు అప్పుడే తెలిసింది. దీని వల్ల నేను చాలా నేర్చుకున్నాను.
‘మానగరం’ సినిమా విడుదలకు నాలుగు రోజుల ముందే తమిళంలో ప్రివ్యూ వేశాం. దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. నేనప్పుడు ఫారిన్లో ఉన్నాను. షో అవ్వగానే ట్విట్టర్లో వచ్చిన స్పందన చూశాక చాలా ఎమోషనల్ అయిపోయాను. ఏడుపొచ్చేసింది. 20 నిమిషాల పాటు ఆపకుండా ఏడుస్తూనే ఉన్నాను. తెలుగులోనూ అలాంటి స్పందనే వచ్చింది. సినిమాను ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్ అంటూ సందీప్ ఉద్వేగంగా చెప్పాడు.’’
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/