Begin typing your search above and press return to search.

ఆ వివాదపంపై మాట్లాడిన సందీప్ కిషన్

By:  Tupaki Desk   |   15 Feb 2018 10:02 AM GMT
ఆ వివాదపంపై మాట్లాడిన సందీప్ కిషన్
X
ఎప్పుడు లేని విధంగా సందీప్ కిషన్ పై కొన్ని రోజుల క్రితం "ప్రాజెక్ట్ Z" ప్రొడ్యూసర్ SK బషీద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సందీప్ తమిళ్ సినిమా మాయావన్ డబ్బింగ్ హక్కులను అతను సొంతం చేసుకున్నాడు. అయితే ప్రెస్ మీట్ లో నిర్మాత కుక్కను పెట్టి సినిమా చేస్తాను గాని మళ్లీ అతనితో సినిమా చేయను అని చెప్పడం సంచలనంగా మారింది. యూట్యూబ్ లో అతను చేసిన వ్యాఖ్యలు ఇప్పటికి ట్రెండ్ అవుతున్నాయి.

దీంతో ఒక్కసారిగా సందీప్ కిషన్ పై కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. కానీ సందీప్ ఎక్కడా ఆ విషయం గురించి ఎక్కువగా స్పందించలేదు. అయితే రీసెంట్ గా ఒక వివరణ ఇచ్చాడు. "ప్రాజెక్ట్ Z" గా పేరుపెట్టబడిన తమిళ చిత్రం "మాయవవన్" యొక్క తెలుగు డబ్బింగ్ వెర్షన్ నిర్మాత బషీద్ 1 కోట్ల 50 లక్షలకు మాట్లాడుకున్నాడు. కానీ అతను నిర్మాతకు కేవలం 40 లక్షలు మాత్రమే ఇచ్చాడు. నా డబ్బింగ్ సినిమాలను నేను ఎందుకు ప్రొత్సహించను. గత సినిమాలను రిలీజ్ చేయలేదా ప్రమోషన్స్ చేయలేదా?. ఇప్పుడు కూడా చేస్తున్నా.

అతను చెప్పేవన్నీ అబద్దాలు. నా వరకు నేను కష్టపడ్డాను. కానీ అతను సినిమా డబ్బింగ్ నాతో చెప్పించకుండా రాకేండు మౌళితో చెప్పించాడు. ఆ సినిమా సెన్సార్ వర్క్ కూడా సరిగ్గా పూర్తి అవ్వలేదు. టైటిల్స్ కూడా తమిళ్ లోనివే. డబ్బింగ్ ఏ మాత్రం పూర్తి కాలేదు. అందుకే ఆ రోజు సినిమా గురించి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. తెలుగు టైటిల్స్ లేవు. సరైన డబ్బింగ్ లేకుండా ఉంటే అది సరైనదేనా అని సందీప్ తెలిపాడు. అదే విధంగా నాపై లావణ్యపై ఒక హాట్ సాంగ్ ని చిత్రీకరించాలని చెప్పడంతో హీరోయిన్ ప్రమోషన్ల కు రాకుండా భయపడి పారిపోయింది. బషీద్ నాలుగుసార్లు జైలుకు వెళ్లాడని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అతన్ని నిషేధించారని కూడా సందీప్ వివరించాడు.