Begin typing your search above and press return to search.
గౌతమ్ మీనన్ కు సారీ చెబుతూనే ఉన్నాడట
By: Tupaki Desk | 19 July 2016 9:30 AM GMTగౌతమ్ మీనన్ కు ఇప్పటికే ఎన్నోసార్లు సారీ చెప్పాడట.. ఇప్పటికీ చెబుతూనే ఉన్నాడట టాలీవుడ్ హీరో సందీప్ కిషన్. ఇతనెందుకు ఆయనకు సారీ చెప్పాలి అంటే.. దాని వెనుక ఓ కథ ఉంది. హీరో కావడానికి ముందు గౌతమ్ మీనన్ దగ్గరే మనోడు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఐతే బేసిగ్గా తనకు యాక్టింగ్ మీదే ఇంట్రెస్ట్ అని.. అందుకే అసిస్టెంట్ డైరెక్టర్ గా సరిగా పని చేసేవాడిని కాదని.. ఆ విషయంలో తనకు ఇప్పటికీ గిల్టీగా ఉంటుందని సందీప్ చెప్పాడు.
‘‘నేను చెన్నైలోనే పుట్టి పెరిగాను. నటుడు కావాలని చెన్నైలో సినిమా ఆఫీసులన్నీ తిరిగాను. చివరికి గౌతమ్ మీనన్ సార్ ను కలిశాక ఆయన ముందు తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయమన్నారు. అంత పెద్ద దర్శకుడి దగ్గర పని చేయడం అంటే అంతకంటే అదృష్టం ఏముంటుందని అక్కడ చేరాను. కానీ నా మనసంతా నటన మీదే ఉండేది. ఆయన దగ్గర పని చేస్తూనే నటుడిగా అవకాశాల కోసం వేరే ప్రయత్నాలు చేస్తుండే వాడిని. గౌతమ్ మీనన్ దగ్గర పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లందరిలో ఎందుకు పనికి రాని వాడిని నేనే అయి ఉంటాను. కానీ ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. ఐతే ఆయన నాకు ఏం చేయాలో చెప్పలేదు. ఏం చేయకూడదో నేర్పించారు. ఐతే అసిస్టెంట్ డైరెక్టర్ గా సరిగా పని చేయనందుకు ఇప్పటికీ ఆయనకు నేను సారీ చెబుతూనే ఉన్నా’’ అని సందీప్ వెల్లడించాడు.
ప్రస్థానంలో నెగెటివ్ రోల్ చేశాక.. ఈ చిత్ర దర్శకుడు దేవా కట్టాకు ఫ్రెండ్స్ అయిన బాలీవుడ్ దర్శకుడు కృష్ణ-డీకే తన గురించి తెలుసుకుని ‘షోర్ ఇన్ ద సిటీ’లో అవకాశమిచ్చారని.. ఆ సినిమాకు ఆడిషన్స్ లో పాల్గొని అవకాశం దక్కించుకోవడం మరిచిపోలేని అనుభవమని సందీప్ చెప్పాడు.