Begin typing your search above and press return to search.

ఒక్క హిట్ సినిమాతో పదేళ్లు నెట్టుకొచ్చిన హీరో..!

By:  Tupaki Desk   |   16 April 2020 10:57 AM GMT
ఒక్క హిట్ సినిమాతో పదేళ్లు నెట్టుకొచ్చిన హీరో..!
X
సినిమా అంటే ఫ్యాషన్ ఉన్న హీరోల్లో సందీప్ కిషన్ ఒకరు. 'ప్రస్థానం' సినిమాతో సందీప్ కిషన్ సినీ ప్రస్థానం మొదలైంది. ఈ సినిమా విడుదలై ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది. అంటే సందీప్ కిషన్ తన పది సంవత్సరాల సినీ కెరీర్ ని పూర్తి చేశాడు. స్నేహగీతం, రొటీన్ లవ్ స్టోరీ, గుండెల్లో గోదారి, వెంకటాద్రి ఎక్సప్రెస్, జోరు, బీరువా, శమంతకమణి, మనసుకు నచ్చింది, టైగర్, డీ ఫర్ దోపిడీ, నిను వీడని నీడను నేను, తెనాలి రామకృష్ణ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. అంతేకాకుండా 'షోర్‌ ఇన్‌ ద సిటీ' అనే బాలీవుడ్ చిత్రంలో కూడా నటించాడు సందీప్ కిషన్. దీంతోపాటు 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏమైనా ఈ పదేళ్ల సినీ ప్రస్థానంలో ఒక్క సాలిడ్ హిట్ పడలేదని చెప్పొచ్చు.

కెరీర్ స్టార్టింగ్ లో వచ్చిన 'వెంకటాద్రి ఎక్సప్రెస్' రేంజ్ హిట్ సందీప్ కిషన్ మళ్ళీ అందుకోలేకపోయాడు. ఎన్ని ప్లాప్స్ వచ్చినా సినిమా అవ‌కాశాల్ని మాత్రం చాలా బాగా ప‌ట్టేస్తాడు సందీప్ అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. త‌న‌కుక‌న్న క‌మ్యూనీకేష‌న్ స్కిల్స్ కార‌ణంగా సందీప్ కి ఇండ‌స్ట్రీలో కాంటాక్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. తన మేనమామ చోటా కె నాయుడు ఎలాగూ ఇండస్ట్రీలో అండగా ఉన్నాడు. ఈ మధ్య నిర్మాతగా మారి 'నిను వీడని నీడను నేను' సినిమాను నిర్మించాడు. సినిమా పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ ఆశించ‌నంత స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. 'మ‌నోడి కెరీర్ ఎండ్ అయిపోంతుదిరా' అనే కామెంట్స్ ప‌డిన ప్ర‌తిసారీ సందీప్ ఏదొక సినిమాతో హడావుడి చేస్తూనే వస్తున్నాడు.

ప్రస్తుతం సందీప్ కిషన్ నరగసూరన్ అనే ఓ తమిళ సినిమాలో నటించాడు. ఈ సినిమా తెలుగులో 'నరకాసురుడు'గా రాబోతోంది. ఈ సినిమా ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో రెలీజ్ అవుతుందంటూ ప్రచారం కూడా జరుగుతోంది. తెలుగులో 'ఏ 1 ఎక్సప్రెస్' సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు నిర్మిస్తున్నారు. అంతేకాకుండా పలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నాడు. ఆయన సినీ కెరీర్లో దశాబ్ధం పూర్తి చేసుకున్న ఈ యంగ్ హీరోకి క‌రోనా క్రైసిస్ త‌రువాతైనా వ‌రుస హిట్లు ప‌డాతాయేమో చూడాలి. సినిమా అంటే కష్టపడాలి అనే ఆటిట్యూడ్ ఉన్న సందీప్ కిషన్ కి మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం..!