Begin typing your search above and press return to search.

'ధారవి బ్యాంక్'ని క్రూరంగా దోచుకున్న‌ అగ్ర‌నటుడు!

By:  Tupaki Desk   |   24 Nov 2022 9:30 AM GMT
ధారవి బ్యాంక్ని క్రూరంగా దోచుకున్న‌ అగ్ర‌నటుడు!
X
ర‌జ‌నీకాంత్ 'ద‌ర్బార్' చిత్రంలో విల‌న్ గా న‌టించాడు సునీల్ శెట్టి. నిజానికి ఈ పాత్ర‌లో అత‌డి న‌ట‌న ఒక వండ‌ర్. శెట్టి ఆరంగేట్ర స‌న్నివేశాల‌న్నీ క‌ట్టి పడేస్తాయి. ఆరంగేట్ర‌మే విల‌నీని మ‌రో లెవ‌ల్లో ఆవిష్క‌రించిన సునీల్ శెట్టి ఆ త‌ర్వాతా తెలుగు-త‌మిళంలో అవ‌కాశాల్ని అందుకుంటున్నాడ‌ని టాక్ వినిపించింది. ఇటీవ‌ల‌ సునీల్ శెట్టి తన OTT అరంగేట్రం తో అద‌ర‌గొట్టాడు. 'ధారవి బ్యాంక్' అనేది సిరీస్ టైటిల్. సునీల్ శెట్టితో పాటు వివేక్ ఒబెరాయ్ - సోనాలి కులకర్ణి కూడా ఈ సిరీస్ లో న‌టించారు. ధారవి బ్యాంక్ అనేది ఒక ప్రత్యేకమైన రివెంజ్ క్రైమ్ డ్రామా సిరీస్. ఇది ఆద్యంతం ఉత్కంఠ క‌లిగించే డ్రామాతో సాగుతుంది.

MX ప్లేయర్ లో పాత్ బ్రేకింగ్ వెబ్ సిరీస్ గా పాపుల‌రైంది. ఈ భూమిపై అత్యంత సంక్లిష్టమైన అత్య‌ధిక‌ జనసాంద్రత ఉన్న ప్రాంతమైన ధారావిలో ప్రమాదకరమైన డాన్ ల అరాచ‌కాల‌తో చమత్కారమైన కథనంతో తెర‌కెక్కింది. సమిత్ కక్కడ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో పవర్-ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ లతో ఓటీటీలో అల‌రిస్తోంది. ప్రపంచంలోని అతిపెద్ద మురికివాడలలో ఒకటైన ధారవిలోని వివిధ ప్రదేశాలలో ఈ సిరీస్ ను విస్తృతంగా చిత్రీకరించారు.

ఇక ఇందులో తలైవన్ పాత్రలో సునీల్ శెట్టి అధికారం దర్పం ప్ర‌ద‌ర్శించేవాడిగా.. ఎదుటివారిని ఆజ్ఞాపించే స్వీయ-నిర్మిత నాయకుడిగా ఇందులో న‌టించారు. ధారవి బ్యాంక్ భారతదేశంలోని అతిపెద్ద మురికివాడలో ఉంది. ధారవికి శక్తివంతమైన క్రూరుడైన కింగ్ పిన్ - తలైవన్ గా సునీల్ శెట్టి అద‌ర‌గొట్టాడు. ఈ సినిమాకి జాతీయ మీడియాల్లో అద్భుత స‌మీక్ష‌లు ద‌క్కాయి. ఐఎండీబీలో 9.3/10 రేటింగ్ ద‌క్కిందంటే ఎంత పెద్ద హిట్టో అర్థం చేసుకోవాలి.

నిజానికి 63 ఏళ్ల వ‌య‌సు ఉన్న పెద్ద మ‌నిషిగా నాయ‌కుడిగా సునీల్ శెట్టిని తెర‌పై చూపారు. ఇది విలన్ షేడ్ ఉన్న పాత్ర‌. ఇందులో శెట్టి న‌ట‌న మ‌హ‌దాద్భుతం. అతనిని 60 ఏళ్లు దాటినట్లుగా చూపించడానికి టీమ్ ప్రోస్తేటిక్స్ ఉపయోగించాల్సి వచ్చింద‌ని టీమ్ తెలిపింది. ఈ పాత్రను పోషించేందుకు శెట్టి హార్డ్ వ‌ర్క్ నిబద్ధత గురించి దర్శకుడు సమిత్ కక్కడ్ మాట్లాడుతూ ''అన్నా తెల్లవారుజామున 5 గంటలకు లొకేషన్ కి చేరుకునేవాడు. ఎందుకంటే జుట్టుకు రంగు వేయడానికి ముఖానికి ప్రోస్తేటిక్స్ ఉపయోగించి మేకప్ చేయడానికి అతనికి నాలుగు గంటలు పట్టేది'' అని తెలిపారు.

''తలైవాన్ పాత్ర ఈ ధారావాహికలో వివిధ వయసుల్లో క‌నిపించాలి. అత‌డు ఎదిగే క్ర‌మంలో పురోగతిని తెర‌పై ప్రదర్శించడానికి మేం అన్న (సునీల్ శెట్టి)కి వయస్సు ఎక్కువ ఉన్న‌ట్టు చూపించాల్సి వచ్చింది. ఎందుకంటే అతను 60 ప్ల‌స్ లోను చాలా ఫిట్ గా ఉన్నాడు. అతను ప్రోస్తేటిక్స్ లేకుండా 63 ఏళ్ల వయస్సులో నటిస్తున్నాడని ఎవరూ నమ్మరు. అందుకే అలా చేసాం'' అని దర్శ‌కుడు తెలిపారు.

త‌లైవ‌న్ రూ. 30000 కోట్ల విలువైన భారీ సామ్రాజ్యానికి నాయకత్వం వహించాలి. అతని ముఖం మాట్లాడే తీరు న‌డిచే వైనం.. ఇత‌ర‌ భంగిమలు ప్ర‌తిదీ యూనిక్ గా ఉండాలి. నాయ‌కుడిగా అతడి పాత్ర‌కు ఉన్న బాధ్యతలను .. అంతుచిక్కనివాడిగా విజయవంతమైన వాడిగా ఉండటానికి అతడి క‌ష్టాల‌ను అనుభవాలను ప్రతిబింబించాలి. కాబట్టి మేం ప్రోస్తేటిక్స్ ఉపయోగించాల్సి వచ్చింది. ఈ రూపాన్ని పరిపూర్ణం చేయడానికి ప్రతిరోజూ 4 గంటలు పట్టినా కానీ.. ఇది పాత్రకు చాలా ప్రామాణికతను జోడించింది. క్రూరమైన తలైవన్ గా ఆవిష్క‌రించింది'' అని తెలిపారు. సునీల్ శెట్టితో పాటు స‌హ‌చ‌రులు ఈ సిరీస్ లో అద్భుతంగా న‌టించారు.

తలైవన్ ధారావి ప్రజల అధికారాన్ని గౌరవాన్ని నిల‌బెడుతూ ఆజ్ఞాపించే స్వీయ-నిర్మిత నాయకుడు. అతను ధారావిని తన కుటుంబంలో భాగమని భావిస్తాడు. అతనికి అత్యంత ప్రాముఖ్యత ధారావిలో ఉంది.. దీనికోసం చాలా శ్ర‌మించాన‌ని సునీల్ శెట్టి వెల్ల‌డించారు.

జీ స్టూడియోస్ నిర్మించిన ఈ ధారావాహికలో వివేక్ ఆనంద్ ఒబెరాయ్- సోనాలి కులకర్ణి- ల్యూక్ కెన్నీ- ఫ్రెడ్డీ దారువాలా- శాంతి ప్రియ- సంతోష్ జువేకర్- నగేష్ భోంస్లే- సిద్ధార్థ్ మీనన్- హితేష్ భోజ్ రాజ్- సమీక్ ష్ భోజ్ రాజ్- సమీక్షర్ బత్త్ నగర్ వంటి తారాగణం న‌టించారు. నవంబర్ 19 నుండి MX ప్లేయర్ లో 'ధారవి బ్యాంక్' స్ట్రీమింగ్ అవుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.