Begin typing your search above and press return to search.
2 కంట్రీస్.. ఏమవుతుందో ఏంటో
By: Tupaki Desk | 29 Dec 2017 5:35 AM GMTకమెడియన్ నుండి హీరోగా ప్రమోషన్ పొందిన సునీల్.. ఆ తరువాత ఎన్నో సినిమాల్లో హీరోగా నటించాడు కాని చాలా వరకూ నిరాశనే మిగిల్చాయి. ఈరోజు ఈ టాలెంటెడ్ హీరో '2 కంట్రీస్' సినిమాతో వస్తున్నాడు. మాస్ సెంటర్లను టార్గెట్ చేస్తూ.. క్లాస్ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయాలని ప్రయత్నిస్తూ ఒక క్లాస్ సినిమాతో వస్తున్నాడు. అయితే ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుంది అంటారు?
ముఖ్యంగా సినిమాను ఆడియన్స్ లోకి తీసుకెళ్ళాలంటే గట్టిగా ప్రమోషన్లను చేయాలి. ఆ విషయంలో ఎందుకో 2 కంట్రీస్ సినిమా మేకర్లు బాగా ఫోకస్ చేయాలేదనే అనిపిస్తోంది. ఎటు చూసినా ఈ సినిమా తాలూకు బజ్ ఉండేలా ప్రయత్నించాలి కాని.. ఎందుకోగాని సునీల్ ఇంటర్యూలు తప్పిస్తే అసలు సినిమా గురించి ఎక్కడా టాక్ లేదు. సునీల్ కూడా తన ఇంటర్యూల్లో చిరంజీవి గురించి త్రివిక్రమ్ గురించి తను అజ్ఞాతవాసిలో ఎందుకు చేయలేదు అనే విషయాలు గురించి ఎక్కువగా చెప్పాడు కాని.. అసలు 2 కంట్రీస్ గురించి మాత్రం జనాలు గట్టిగా చర్చించుకునేంతగా చెప్పనేలేదు. దానితో సినిమాకు పెద్ద మైనస్ అయిపోయేలా ఉంది.
అసలు ఈరోజు సినిమా రిలీజ్ అవుతుందంటే.. ఊళ్ళలోనైనా టౌనుల్లో అయినా బాగా హడావుడి కనిపించాలి. కాని ఎందుకో సునీల్ విషయంలో ఆ సినిమా నిర్మాతలు - పి ఆర్ టీం హీరో క్రేజును సరిగా మార్కెట్ చేసుకోలేకపోయారు. ఇక ఓవర్సీస్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. అసలే అక్కడ భారీ చలిగాలులూ తో పాటు న్యూఇయర్ వేడుకలు వస్తున్న వేళ.. సినిమా గురించి మినిమం కూడా పబ్లిసిటీ లేకపోవడంతో.. ఎన్ని ధియేటర్లలో రిలీజ్ అవుతుందో కూడా ఎవ్వరికీ తెలియని పరిస్థితి. మంచి గుర్తింపు ఉన్న శంకర్ లాంటి డైరెక్టర్ తో అల్ రెడీ హిట్ అయ్యిన " 2 కంట్రీస్ " రీమేక్ తో తెలుగు లో వస్తున్న సునీల్ పబ్లిసిటీ అండ్ సినిమా ప్.ఆర్.ఓ టీం మీద కూడా కొంచెం ద్రుష్టి పెట్టి ఉండాలిసింది ..