Begin typing your search above and press return to search.
జైసేన కు అండ పవన్ ఫాన్సే
By: Tupaki Desk | 7 Jun 2019 3:52 AM GMTఎన్నికల ఫలితాల్లో అనూహ్య ఓటమి తర్వాత జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోస్ట్ మార్టంలో పడిపోయారు. ఇంత దారుణమైన ఫలితాలు రావడం వెనుక కారణాలు తన టీం తో కలిసి విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉండగా జనసేన ఆలోచనా శైలి రాజకీయ లక్ష్యాలను ఉద్దేశించి సీనియర్ దర్శకుడు వి సముద్ర తీసిన జైసేన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిన్న ఓ ఈవెంట్ కూడా చేశారు. ఈ పేరుతో ఓ సినిమా వస్తోందని ప్రేక్షకులకూ అప్పుడే తెలిసింది.
పవన్ వ్యక్తిత్వాన్ని అంతర్లీనంగా తీసుకుని జనసేన ఐడియాలజీని తెరమీద చూపించే ప్రయత్నమే జైసేన అని దర్శకుడు స్పష్టం చేశారు. ఇందులో అసలు విశేషం శ్రీకాంత్ సునీల్ హీరోలుగా నటించడం. వీళ్ళతో పాటు మరో నలుగురు కుర్రాళ్ళు కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న జైసేనలో వైసిపి ప్రచారంలో పాల్గొన్న పృథ్వి కూడా ఉండటం విశేషం
అయితే ఈ సినిమా ఎన్నికలకు ముందే తీసిందని అర్థమవుతోంది. ఒకవేళ జనసేన గెలుస్తుందనో లేదా ప్రభుత్వ ఏర్పాటులో చక్రం తిప్పబోతుందనో ముందస్తు అంచనాతో ప్లాన్ చేశారు కాబోలు. కాని ఇప్పుడు పరిస్థితి అనుకూలంగా లేదు. సో జైసేనను ఆదరించాల్సింది ముఖ్యంగా పవన్ అభిమానులే. ఎలాగూ తమ హీరో సినిమాలు చేసే ప్రసక్తే లేదంటున్నాడు కాబట్టి ఈ రకంగా జనసేనకు మద్దతు ఇచ్చే సినిమాలకు అండగా ఉండాలి. త్వరలో విడుదల కానున్న జైసేన టైటిల్ లోగో అన్ని రాజకీయంగానే ప్రతిబింబిస్తున్నాయి కాబట్టి ఎంతవరకు దీనికి ఫాన్స్ సపోర్ట్ దక్కుతుంది అనే దాన్ని బట్టి విజయం ఆధారపడి ఉంటుంది.