Begin typing your search above and press return to search.
సునీల్ కొత్త సినిమా టైటిల్ ఇదే..
By: Tupaki Desk | 30 Jun 2016 1:30 PM GMTవరుసగా ఫ్లాపులు ఎదురవుతున్నా.. సునీల్ బాబుకు అవకాశాల విషయంలో మాత్రం లోటు లేదు. అతను హీరోగా త్వరలోనే ‘జక్కన్న’ సినిమా రాబోతోంది. మరోవైపు రైటర్ టర్న్డ్ డైరెక్టర్ వీరు పోట్ల దర్శకత్వంలో ‘ఈడు గోల్డెహె’ అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు సునీల్. ఈ రెండూ కాక.. ఓనమాలు.. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి మంచి సినిమాలు అందించిన క్రాంతి మాధవ్ దర్శకత్వలోనూ సునీల్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రానికి ‘ఉంగరాల రాంబాబు’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం. ఇంతకుముందు చలం హీరోగా నటించిన ‘సంబరాల రాంబాబు’ పెద్ద హిట్. చలం తరహాలోనే కామెడీ నుంచి హీరోయిజానికి మారిన సునీల్.. ‘సంబరాల రాంబాబు’ టైటిల్ ను కొంచెం మార్చి తన కొత్త సినిమాకు వాడుకోబోతున్నాడు. ఈ సినిమాలో హీరోకు ఉంగరాల పిచ్చి ఉంటుందట. అందుకే ఈ టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. క్యాచీగా ఉన్న ఈ టైటిల్ ఈజీగా జనాల్లోకి వెళ్లిపోయే అవకాశముంది.
యునైటెడ్ మూవీస్ బేనర్ మీద పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమిళంలో మంచి పేరు సంపాదించిన మలయాళ అమ్మాయి మియా జార్జ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెకిదే తొలి సినిమా. ఇప్పటికే సగం సినిమా పూర్తయిందట. ఈ ఏడాది ఆఖర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది. కామెడీ-మాస్ సినిమాలు చేసే సునీల్ ను క్రాంతి మాధవ్ ఎలా ప్రెజెంట్ చేస్తాడన్నది ఆసక్తికరం.