Begin typing your search above and press return to search.
శ్రీను వైట్ల డైరెక్షన్ లో కమెడియన్?
By: Tupaki Desk | 24 Dec 2017 4:30 AM GMTబెస్ట్ కామెడియన్ గా టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సునీల్ హీరోగా సక్సెస్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. హీరోగా సినిమాలు బాగానే చేశాడు గాని విజయాలను మాత్రం చాలా తక్కువ అందుకున్నాడు. అయితే ఫైనల్ గా తన నిర్ణయాన్ని సునీల్ మార్చుకోవడంతో స్టార్ దర్శకులు అందరు ఇప్పుడు సునీల్ వైపే చూస్తున్నారు. ఎందుకంటే మనోడు కామెడీ పాత్రలను కూడా చేస్తాను అని స్టేట్మెంట్ ఇచ్చాడు కధా..
దీంతో సునీల్ కోసం స్పెషల్ గా కొన్ని క్యారెక్టర్స్ ని అనుకుంటున్నారట. ఇప్పటికే సునీల్ రెండు సినిమాల్లో కమెడియన్ పాత్రలను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా మరొక పాత్రకు కూడా ఒకే చెప్పాడని తెలుస్తోంది. చిరంజీవి ప్రతిష్టాత్మక సైరా సినిమాలో అలాగే త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమాలో నటించడానికి రెడీ అయిన సునీల్ త్వరలో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చే సినిమాలో కూడా కమెడియన్ గా కనిపించబోతున్నాడు. రవితేజ హీరోగా శ్రీను వైట్ల డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కనుంది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్ర యూనిట్ చాలా బిజీగా ఉంది. అయితే ఇందులో ఒక స్పెషల్ పాత్రకు శ్రీను వైట్ల సునీల్ ని ఎంచుకున్నాడట. సునీల్ కూడా స్టోరీ వినగానే ఒకే చేశాడని ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. ఇక హీరోయిన్ కోసం దర్శకుడు ప్రస్తుతం సెర్చ్ చేస్తున్నాడు. అన్ని పాత్రలను సెలెక్ట్ చేసుకున్న తరువాత ఫైనల్ గా సినిమాను మార్చ్ లో మొదలు పెడతారట. రవితేజ కూడా అప్పటివరకు టచ్ చేసి చూడు సినిమాను రిలీజ్ చేసి శ్రీను వైట్ల ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించనున్నాడు.