Begin typing your search above and press return to search.
క్లిష్ట మైన పరిస్థితిలో సునీల్ కెరీర్!
By: Tupaki Desk | 22 Feb 2020 7:34 AM GMTస్టార్ కమెడియన్ గా చాలాకాలంపాటు టాలీవుడ్ ను ఏలిన సునీల్ కు ఇప్పటికీ మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే మన టాలీవుడ్ కమెడియన్ల పంథాలోనే సునీల్ కూడా హీరోగా మారడంతో కమెడియన్ పాత్రలకు చాలా కాలం పాటు దూరంగా ఉన్నాడు. హీరోగా మొదట్లో మంచి హిట్లు దక్కినప్పటికీ తర్వాత మాత్రం వరస ఫ్లాపులతో మొదటికే మోసం వచ్చింది. దీంతో రూటు మార్చిన సునీల్ కమెడియన్ గా రీఎంట్రీ ఇచ్చాడు. రీ ఎంట్రీలో మంచి ఆఫర్లే వచ్చాయి కానీ బ్రేక్ మాత్రం దక్కలేదు.
గతంలో నవ్వించినట్టుగా సునీల్ నవ్వించలేకపోతున్నాడనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. సునీల్ ఆప్త మిత్రుడు త్రివిక్రమ్ బ్రేక్ ఇవ్వడం ఖాయమని అనుకుంటే అది కూడా జరగడం లేదు. 'అరవింద సమేత' లో ఎక్కువ స్కోప్ లేదు.. ఈమధ్య సంక్రాంతి హిట్టుగా నిలిచిన 'అల వైకుంఠపురములో' సినిమాలో నటించినప్పటికీ సునీల్ పాత్రకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. హాస్యనటుడిగా సెకండ్ ఇన్నింగ్స్ లో బ్రేక్ దక్కకపోవడంతో సునీల్ విలన్ పాత్రలను కూడా యాక్సెప్ట్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చాడు. అయితే అది కూడా సునీల్ కు బ్రేక్ ఇవ్వడం లేదు.
రవితేజ సినిమా 'డిస్కోరాజా' లో సునీల్ విలన్ గా నటించాడు కానీ ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఆ సినిమా చేదు ఫలితం అందుకోవడానికి కారణాలు చాలానే ఉన్నప్పటికీ సునీల్ విలనీ కూడా ఒక కారణమని వ్యాఖ్యలు వినిపించాయి. ఈ సినిమా ఫలితం సంగతి పక్కన పెడితే 'కలర్ ఫోటో' అనే సినిమాలో కూడా సునీల్ విలన్ గా నటిస్తున్నాడు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ సినిమా విడుదలైతే కానీ సునీల్ విలనీకి ప్రేక్ష కాదరణ దక్కుతుందా లేదా అనేది తెలియదు. అయితే విలన్ గా టాలీవుడ్ లో నిలదొక్కుకోవడం కూడా సులువు కాదు. ఎందుకంటే హీరోయిన్లను దిగుమతి చేసుకున్నట్టుగానే మన ఫిలింమేకర్స్ మరాఠీ.. కొంకణి.. గుజరాతి.. చపాతి విలన్లను అదే పనిగా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. ఆ తెలుగు రాని బ్యాచ్ తో పోటీ పడి విలన్ గా గుర్తింపు తెచ్చుకోవడం మహా కష్టం. మరి సునీల్ కెరీర్ భవిష్యత్తులో ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.