Begin typing your search above and press return to search.
'సక్సెస్ ఎంజాయ్ చెయ్.. కెరీర్ ని ఎంజాయ్ చేయొద్దు'.. సుహాస్ కి సునీల్ సలహా!
By: Tupaki Desk | 19 Oct 2020 12:30 PM GMTసీనియర్ హాస్యనటుడు సునీల్ కామెడీ వేషాలు మానేసి హీరోగా నటించిన సంగతి తెలిసిందే. అయితే గత కొన్నేళ్లుగా సునీల్ హీరోగా నటించిన సినిమాలు పరాజయం పాలవడంతో హీరో వేషాలు మాత్రమే చేయాలని అనుకోకుండా మళ్ళీ కమెడియన్ కమ్ సపోర్టింగ్ రోల్స్ లో కంటిన్యూ అవుతున్నాడు. ఈ క్రమంలో నెగెటివ్ రోల్స్ కూడా పోషిస్తున్నాడు. 'డిస్కో రాజా' మూవీలో విలన్ గా నటించిన సునీల్.. ఇప్పుడు మరో హాస్యనటుడు సుహాస్ హీరోగా పరిచయం అవుతున్న ''కలర్ ఫోటో'' సినిమాలో పూర్తి స్థాయి విలన్ గా నటించాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి సందీప్ రాజ్ దర్శకత్వం వహించాడు. త్వరలో 'ఆహా' లో విడుదల కానున్న 'కలర్ ఫోటో' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరిగింది.
ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ.. ''సుహాస్ నీ వాయిస్ చాలా బాగుంది. అందరి నుంచి అన్ని తీసుకో. సక్సెస్ ఎంజాయ్ చెయ్.. కెరీర్ ఎంజాయ్ చేయొద్దు. ఈ రోడ్ దాటిన తర్వాత అందరి మాటలు మర్చిపో. డిలీట్ అనేది మెయిన్. మైండ్ లో ఎంత హార్డ్ డిస్క్ క్లీన్ గా ఉంటే అంత మంచి ఐడియాస్ వస్తాయి' అని సుహాస్ కి సలహా ఇచ్చాడు. కామెడీలో ప్రత్యేకమైన శైలిని చూపించే సునీల్.. తన ప్రసంగాన్ని వ్యక్తిగత అనుభవాలతో ముడిపెడుతూ సాగించారు. ఈ సినిమాపై నమ్మకం పెట్టుకున్న సునీల్ కి ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి. ఇదిలా ఉండగా సునీల్ హీరోగా 'వేదాంతం రాఘవయ్య' అనే సినిమా రానుంది. ఈ చిత్రానికి డైరెక్టర్ హరీష్ శంకర్ కథను అందించడంతో పాటు చిత్ర సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. 14 రీల్స్ రామ్ ఆచంట - గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.