Begin typing your search above and press return to search.

మెగా గ్యాంగ్ లో సునీల్ మెరిశాడుగా

By:  Tupaki Desk   |   13 Jun 2016 5:32 AM GMT
మెగా గ్యాంగ్ లో సునీల్ మెరిశాడుగా
X
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాలో నటించమంటూ.. రీసెంట్ గా సునీల్ కి ఓ ఆఫర్ వచ్చింది. చిరంజీవి పోషించే రెండు పాత్రల్లో ఒక రోల్ వెంట సినిమా అంతా ఉండే కమెడియన్ పాత్ర ఇది. మెగాస్టార్ పక్కన సునీల్ కామెడీ కాంబినేషన్ ఠాగూర్ లో చూసి ఉండడంతో.. ఈ రోల్ సునీల్ కెరీర్ లో వనాఫ్ ది బెస్ట్ అవుతుందని అనుకుంటే.. మనోడి ఆ పాత్రను వదులుకోవడం చాలామందికి కోపం తెప్పించింది. ఇప్పుడా రోల్ వెన్నెల కిషోర్ కి వెళ్లినా.. తనపై వచ్చిన విమర్శలకు సునీల్ ఇప్పుడు స్మార్ట్ ఆన్సర్ ఇచ్చేశాడు.

మా అవార్డ్ ఫంక్షన్ లో మెగాస్టార్ స్టెప్స్ వేసిన విషయం తెలిసిందే. ఈ పెర్ఫామెన్స్ లో మెగాస్టార్ గ్యాంగ్ గా నలుగురు హీరోలు మెరిశారు. సాయిధరం తేజ్ - శ్రీకాంత్ - నవదీప్ లతో పాటు.. సునీల్ కూడా చిరు పక్కన చిందేశాడు. తేజు ఎలాగూ మెగా కాంపౌండ్ హీరో. శ్రీకాంత్ - నవదీప్ లు మెగాస్టార్ ఫ్యాన్స్. వాళ్ల గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. చిరంజీవి పక్కన సునీల్ డ్యాన్స్ చేయడమే సంథింగ్ స్పెషల్.

చిరు పక్కన గ్యాంగ్ లో ఉండే నలుగురిలో ఒకడిగా కనిపించడంతో.. ఆయనంటే తనకెంత ఇష్టమో, ఆరాధనో చెప్పేశాడు సునీల్. ప్రస్తుతం హీరోగా మంచి పొజిషన్ లో ఉన్న సునీల్.. మళ్లీ కమెడియన్ టర్న్ ఇచ్చుకోవడం ఇష్టం లేకే 150వ సినిమాలో ఛాన్స్ వదులుకున్నాడు. వాస్తవానికి సునీల్ ఆ రోల్ చేయకపోవడమే కరెక్ట్ అని చిరు కాంపౌండ్ నుంచి కామెంట్స్ వినిపించాయట. అలాగని.. తనకు మెగాస్టార్ అంటే ఎంతటి స్ఫూర్తో ఇప్పుడు చెప్పకనే చెప్పాడు సునీల్.