Begin typing your search above and press return to search.

సునీల్‌ చుట్టూ పోగడిపోయారుగా..

By:  Tupaki Desk   |   10 Feb 2016 4:03 AM GMT
సునీల్‌ చుట్టూ పోగడిపోయారుగా..
X
చూస్తుంటే సింగిల్‌ గా వచ్చేద్దాం అనుకున్న సునీల్‌ కు ఇప్పుడు ధియేటర్లు దొరికేలా లేవే. అవును.. మన సిక్స్‌ ప్యాక్‌ హీరో సునీల్‌ తన ''కృష్ణాష్టమి'' కోసం ఎన్నో రోజులు వెయిట్‌ చేశాడు. అబ్బే షూట్‌ చేయడానికి కాదు.. రిలీజ్‌ చేయడానికి. మాంచి డేట్‌ కోసం నిర్మాత దిల్‌ రాజు వెయిటింగ్‌ అక్కడ. ఇన్నాళ్టికి ఫిబ్రవరి 19 అనే సోలో డేట్‌ దొరికింది. కాని అనుకున్నం సాఫీగా లేదు సీన్‌ అక్కడ.

నిజానికి ఫిబ్రవరి 12న కృష్ణగాడి వీర ప్రేమ గాధ - 19న కృష్ణాష్టమి - ఆ తరువాత వారం స్పీడున్నోడు సినిమా రావాలని అనుకన్నారు. కాని ఇక్కడ స్పీడున్నోడు అనుకున్నదానికంటే మూడు వారాలు ముందే ఫిబ్రవరి 5న వచ్చేసింది. ఇక విషయం ఏంటంటే.. 12న నాని సినిమాతో పాటు ఆది గరం కూడా వస్తోంది. ఇప్పటికే సంక్రాంతి సినిమాల్లో ఓ రెండు ఇంకా జోరు కొనసాగిస్తుంటే.. ఈ గరం అండ్‌ కృష్ణాగాడి...కథ హిట్టయ్యేలాగే ఉన్నాయి. ఇవన్నీ ఆడుతుంటే మరి సునీల్‌ సినిమాకు విజిబిలిటీ ఎక్కడ నుండి వస్తుంది?

అంతే కాకుండా.. 19న సునీల్‌ సినిమాతో పాటు గీతా ఆర్ట్స్‌ వారు ''మీకు మీరే మాకు మేమే'' సినిమాను కూడా రిలీజ్‌ చేస్తున్నారు. అంటే కొన్ని ధియేటర్లు వారు లాగేస్తారనమాట. ఇలా సునీల్ చుట్టూ అందరూ పోగడిపోతే.. ఇక సోలో రిలీజ్‌ అనే పదానికి అర్దమే లేకుండా పోయింది. కేవలం కంటెంట్‌ తో తన దమ్ము చూపించే సునీల్‌ నిలదొక్కుకోవాలి ఇప్పుడు.