Begin typing your search above and press return to search.
పోయాడని రాసేస్తారా? సునీల్ సీరియస్!!
By: Tupaki Desk | 14 April 2019 9:21 AM GMTచనిపోకముందే ఫలానా ఆర్టిస్టు పోయాడని రాసేస్తే అది ఎంత దౌర్భాగ్యం? విచ్చలవిడి మీడియా.. సోషల్ మీడియా పర్యవసానమిది. జర్నలిస్టు ప్రమాణాల్ని తుంగలో తొక్కేస్తూ సోషల్ మీడియాలో సాగిస్తున్న అరాచకాలకు ఎన్నో అపార్థాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ విషయంలో సోషల్ మీడియా చేసిన ఓ పనికి నటుడు సునీల్ చాలా సీరియస్ అయ్యారు. ``సునీల్ చచ్చిపోయాడని రాశారు. దానికి 10లక్షల (1 మిలియన్) వ్యూస్ వచ్చాయి. తమ మీడియా పబ్లిసిటీ కోసం ఇంతకు దిగజారతారా? ఇదెక్కడి న్యాయం?`` అని ఆవేదనగానే ప్రశ్నించారు సునీల్. హైదరాబాద్ లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో మీడియా విలువల్ని ఆయన సున్నితంగా ప్రశ్నించే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియా ట్రెండ్ లో ఎన్నో అపార్థాలు.. అనర్థాలు జరుగుతున్నాయని సునీల్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. మేలు కంటే ఇక్కడ కీడే ఎక్కువ జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
అలా రాసిన వ్యక్తి (జర్నలిస్టు కాదు)పై పోలీసులకు ఫిర్యాదు చేశారా? అని అడిగితే .. ఫిర్యాదు చేశానని సునీల్ తెలిపారు. ``తప్పయిపోయింది. వదిలేయండి. ఫ్యామిలీకి ఇబ్బంది అవుతుంది. నేను మీకు అభిమానిని.. రాసినందుకు క్షమించండి అని ప్రాధేయపడ్డాడు. ఒకరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వదిలేశాను`` అని అన్నారు. మేము నిన్ను హర్ట్ చేస్తాం.. కానీ నువ్వు మాకు వినోదం పంచాలి! అన్న చందగా అయిపోయాయి కొన్ని మీడియాలు అని పాయింట్ అవుట్ చేశారు. టైమ్స్ లాంటి కొన్ని మీడియాలు ప్రమాణాలు పాటిస్తున్నాయని.. అక్కడ వచ్చే ప్రతిదీ నిజనిర్ధారణ చేసుకున్నాకే రాస్తున్నారని సునీల్ వెల్లడించారు.
సోషల్ మీడియా యుగంలో విలువలు దిగజారిపోయాయని సునీల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకు ముందు మీడియా ఎక్స్ పోజర్ మరీ ఇంతగా ఉండేది కాదు. నా కెరీర్ ఆరంభంలో ఏవో కొన్ని పరిమిత మీడియాలు ఉండేవి. ఇంటర్వ్యూలు చేసుకుని వెళ్లిపోయేవి. ప్రతి ఒక్కరికి విడిగా అవసరం అనుకుంటే ఇంటర్వ్యూలు ఇచ్చేవాళ్లం. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారింది. ఒకేసారి ఎంత మీడియా ఉన్నా కవరేజీ సింగిల్ టేక్ లోనే అయిపోతోందని సునీల్ తనదైన శైలిలో అన్నారు. `చిత్రలహరి`లో తన పాత్రకు అద్భుత స్పందన వచ్చిందని.. చాలా కాలం తర్వాత సంతృప్తికరమైన పాత్రలో నటించానని సునీల్ ఆనందం వ్యక్తం చేశారు. సక్సెస్ సందర్భంగా మీడియా ఇంటర్వ్యూలో సునీల్ పలు ఆసక్తికర సంగతుల్ని ముచ్చటించారు.