Begin typing your search above and press return to search.
నా ఆత్మ ఇంకులా మారితే వచ్చిందే పెనిమిటి..!
By: Tupaki Desk | 15 Oct 2018 7:03 AM GMTఎన్టీఆర్, త్రివిక్రమ్ ల కాంబినేషన్లో దసరా కానుకగా వచ్చిన ‘అరవింద సమేత’ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే. ఇక ఈ చిత్రంలోని పెనిమిటి సాంగ్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. ట్యూన్ చేసిన తమన్ పై, సాహిత్యం అందించిన రామజోగయ్య శాస్త్రీ పై అద్బుతమైన సందర్బంలో ఆ పాటను పెట్టిన త్రివిక్రమ్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ పాట గురించి త్రివిక్రమ్ మరియు ఎన్టీఆర్ లు పలు ఇంటర్వ్యూలో మాట్లాడారు. తాజాగా ఈ పాటపై సునీల్ విభిన్నంగా స్పందించాడు.
తాజాగా సినిమా థ్యాంక్స్ మీట్‌ను నిర్వహించడం జరిగింది. ఆ మీట్లో సునీల్ మాట్లాడుతూ.. నేను, త్రివిక్రమ్ కలిసి రూంలో ఉన్నప్పుడు వంట చేయడం - రూం తూడ్చడం - ఇతర పనులన్నీ చేయడం నా డ్యూటీ. ఒకసారి త్రివిక్రమ్ చెన్నై వెళ్లాడు. వెళ్లి వారం రోజులయ్యింది, వెళ్లిన దగ్గర నుండి ఫోన్ చేయలేదు. నా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి, వస్తాడా, లేదా, తింటున్నాడా లేదా, అసు పడుకుంటున్నాడా, ఆరోగ్యం ఎలా ఉందో అంటూ నేను ఆలోచిస్తూ ఉండేవాడినని సునీల్ అన్నాడు.
అప్పటి నా పరిస్థితి గురించి చెప్పేందుకే దేవుడు నా ఆత్మను పెన్నులో ఇంకుగా మార్చి ఈ పాట రాసేలా క్రియేట్ చేశాడేమో అనిపిస్తుందని సునీల్ ఫన్నీ కామెంట్స్ చేశాడు. సునీల్ పెనిమిటి పాటపై చేసిన వ్యాఖ్యలకు అంతా నవ్వుకున్నారు. హీరోగా సినిమాలు చేసి మళ్లీ కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన సునీల్ ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. సినిమా సక్సెస్ అవ్వడంతో సునీల్ మళ్లీ కమెడియన్ గా సెటిలయ్యే అవకాశం ముందని సినీ వర్గాల వారు అంటున్నారు.