Begin typing your search above and press return to search.
సునీల్ గోల్డే కాదెహే.. స్టార్ కూడా!
By: Tupaki Desk | 20 Feb 2016 6:20 AM GMTదర్శకుడు వీరు పోట్ల సునీల్ ని... వీడు గోల్డ్ ఎహే అంటూ కీర్తిస్తూ అదే పేరుతో ఓ సినిమాని తీస్తున్నాడు. ఇప్పుడు ఆయనకి కృష్ణాష్టమి చూపిస్తే మాత్రం సినిమా పేరును మార్చేసుకొంటాడేమో అనిపిస్తోంది. వీడు గోల్డ్ ఎహే అని కాకుండా... వీడు గోల్డ్ స్టార్ ఎహే అని టైటిల్ ఫిక్స్ చేస్తాడేమో! తాజాగా సునీల్ కి గోల్డెన్ స్టార్ అని బిరుదు ఇచ్చేశారు మరి. కమెడియన్ గా హీరోగా మారి ఇప్పుడిప్పుడే తొలి అడుగులు వేస్తున్నాడు సునీల్. ఆయనకి ఇంకా మాస్ ఇమేజ్ కూడా రాలేదు. అప్పుడే స్టార్ ని చేసేశారు. కృష్ణాష్టమి సినిమా టైటిల్ కార్డ్స్‌లో గోల్డెన్ స్టార్ సునీల్ అని వేసేశారు. అది చూసిన ప్రేక్షకులు ఒకొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు. ఇక మనకు సిల్వర్ స్టార్ - ఐరెన్ స్టార్ మాత్రమే దొరకాలి.... అంటూ చెవులు కొరుక్కోవడం కనిపిస్తోంది.
ఇదివరకు ఒక హీరోకి మాస్ ఇమేజ్ వస్తే తప్ప స్టార్ అనేవారు కాదు. కానీ ఇప్పుడు వాటితో సంబంధం లేకుండా ఒకట్రెండు సినిమాలు చేసేసరికి స్టార్ అనేస్తున్నారు. రకరకాల బిరుదుల్ని తగిలించేసుకొంటున్నారు. అందుకే సునీల్ కూడా గోల్డెన్ స్టార్ అని వేయించేసుకొన్నాడు. దిల్ రాజు ప్రోద్భలంతోనే ఆ బిరుదు తగిలించుకొన్నాడట సునీల్. కానీ ఆయనకి మాత్రం అస్సలు ఇష్టం లేదట. హీరో్నైనా నేను కమెడియన్ కిందే లెక్కండీ, వద్దండీ అన్నప్పటికీ నువ్వు స్టార్ వే అంటూ గోల్డెన్ స్టార్ కిరీటాన్ని తొడిగారట. కానీ ఆ బిరుదు మాత్రం సునీల్ కి పెద్దగా అచ్చొచ్చేలా కనిపించడం లేదు. కృష్ణాష్టమికి తొలి ఆటతోనే నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చేశాయి. మరి సునీల్ ఆ బిరుదును కంటిన్యూ చేస్తాడో లేక మానేస్తాడో చూడాలి.