Begin typing your search above and press return to search.
వామ్మో... కాస్త తగ్గించుకో బాసు
By: Tupaki Desk | 2 Dec 2018 5:30 PM GMTకమెడియన్ గా స్టార్ డం దక్కించుకున్న సునీల్ కు హీరోగా అవకాశాలు రావడంతో ఆ రూట్ లో వెళ్లాడు. కొన్నాళ్లకు హీరోగా దారులు మూసుకు పోయిన నేపథ్యంలో మళ్లీ ఫుల్ లెంగ్త్ కామెడియన్ పాత్రలు పోషిస్తున్నాడు. తాజాగా సునీల్ కమెడియన్ గా నటించిన పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే అవేవి కూడా సునీల్ కు మునుపటి కమెడియన్ క్రేజ్ ను తెచ్చి పెట్టలేక పోతున్నాయి. ఈ సమయంలోనే సునీల్ కు హీరోగా ఒక ఛాన్స్ వచ్చింది.
ప్రముఖ రచయిత వలిగొండ శ్రీనివాస్ దర్శకుడిగా మారి ఇప్పటికే ‘అంధగాడు’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. అయినా కూడా నిరాశ పడకుండా మరో ప్రయత్నంగా సునీల్‌తో ఒక చిత్రాన్ని చేసేందుకు సిద్దం అయ్యాడు. సునీల్ బాడీ లాంగ్వేజ్‌కు సెట్ అయ్యే ఒక కథను శ్రీనివాస్ రూపొందించాడట. ఆ కథ సునీల్ కు కూడా నచ్చడంతో నటించేందుకు ఓకే చెప్పాడట. ఈ చిత్రంను కొత్త నిర్మాత నిర్మించేందుకు ముందుకు వచ్చాడు.
అయితే ఆ కొత్త నిర్మాతకు సునీల్ పారితోషికం షాకింగ్ గా అనిపించిందట. సునీల్ ఏకంగా 1.5 కోట్లు పారితోషికం డిమాండ్ చేయడంతో నిర్మాత చేతులెత్తేసినట్లుగా తెలుస్తోంది. సినిమాను అయిదు కోట్ల లోపు బడ్జెట్ తో శ్రీనివాస్ పూర్తి చేయాలని భావిస్తుంటే సునీల్ 1.5 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమా పట్టాలెక్కేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హీరోగా పెద్దగా క్రేజ్ లేని సునీల్ ఇప్పుడు కోట్లలో పారితోషికం అడిగితే ఎలా చెప్పండి అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏదో ఒక ఆఫర్ రావాలంటే పారితోషికం తగ్గించుకోవాల్సిందే.