Begin typing your search above and press return to search.

బన్నీ సినిమా మీదే సునీల్ ఆశలు

By:  Tupaki Desk   |   26 Nov 2019 1:30 AM
బన్నీ సినిమా మీదే సునీల్ ఆశలు
X
ఒక స్టార్ కమెడియన్ హీరో గా కొన్నేళ్ళు మాత్రమే కొనసాగగలరు. రాజేంద్ర ప్రసాద్ , నరేష్ వంటి కామెడీ హీరోలు కొన్ని ఏళ్ళు మాత్రమే హీరోగా సినిమాలు చేసారు. ఇక అలి, వేణు మాధవ్ కూడా అంతే. సునీల్ కూడా అదే చేసాడు. కమెడియన్ గా పీక్ టైంలో ఉండగానే హీరోగా చేసే సినిమాల మీద దృష్టి పెట్టి చేతులు కాల్చుకున్నాడు. ముఖ్యంగా కామెడీ ప్రాదాన్యత కథలు కాకుండా యాక్షన్ కమర్షియల్ సినిమాల వైపు మొగ్గు చూపి దారుణంగా నష్ట పోయాడు.

అయితే మళ్ళీ కమెడియన్ గా సినిమాల పై ఫోకస్ పెట్టాడు. త్రివిక్రమ్ -ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన 'అరవింద సమేత' లో నీలాంబరి అనే పాత్రలో నటించాడు. ఆ సినిమా తనకు కమెడియన్ గా మళ్ళీ అవకాశాలు అందిస్తుందని ఊహిస్తే అలాంటివేం జరగలేదు. పాత్రలో కామెడీ లేక పోవడంతో ఆ పాత్ర క్లిక్ అవ్వలేదు. అందుకే మళ్ళీ 'అల వైకుంఠపురములో' లో నటిస్తున్నాడు.

ఈసారి తన స్నేహితుడు త్రివిక్రమ్ సునీల్ కామెడీ పైన ఫోకస్ పెట్టి మంచి కామెడీ రోల్ చేయిస్తున్నాడట. సినిమాలో బన్నీ -సునీల్ మధ్య కామెడీ హైలైట్ అవుతుందని అంటున్నారు. ఒక వేల ఇది నిజమైతే పరవా లేదు లేదంటే మళ్ళీ కమెడియన్ రోల్స్ కి కూడా సునీల్ గుడ్ బై చెప్పాల్సి వస్తుందేమో.