Begin typing your search above and press return to search.
'సైరా'ఛాన్స్ మిస్ అవ్వలేదు
By: Tupaki Desk | 17 Sep 2017 11:08 AM GMTటాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ కమెడియన్స్ లో ఒకరిగా పెరు తెచ్చుకున్న సునీల్ హీరోగా మారిన తర్వాత మాత్రం అంతగా మెప్పించలేకపోయాడు. కామెడీ తరహా చిత్రాలతో పాటు మధ్య మధ్యలో కొన్ని ఫ్యామిలీ - యాక్షన్ తరహా చిత్రాలను చేసి మెప్పించే ప్రయత్నం చేశాడు. కానీ మనోడు కమెడియన్ గా దక్కించుకున్న క్రేజ్ హీరోగా సాదించలేకపోయాడు. మొదట్లో రెండు సినిమాలు బాగానే ఆడినా ఆ క్రేజ్ అంతవరకే పనికొచ్చింది.
అయితే సునీల్ మాత్రం అపజయం కథకే గాని.. కథనాయకుడికి కాదు అంటున్నాడు. రీసెంట్ గా ఆయన తీసిన ఉంగరాల రాంబాబు రిజల్ట్ చాలా సంతోషాన్నీ ఇచ్చిందని అంటున్నాడు. జక్కన్న తర్వాత ఈ సినిమా ఆ స్థాయి విజయాన్ని ఇచ్చిందని చెబుతూ.. ఫస్ట్ హాఫ్ లో నా కామెడీ సెకండ్ ఆఫ్ లో క్రాంతి మాధవ్ దర్శక శైలిలో ఉండే బావోద్వేగ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి అని చెబుతున్నాడు. తను కమెడియన్ గా ఇకనుండి కచ్చితంగా కొనసాగుతాను అంటూ.. మర్యాద రామన్న తర్వాత హీరోగా ఛాన్సులు పెరుగుతూ వచ్చాయి.అయినా సరే మిరపకాయ్ సినిమాలో కమెడియన్ గా చేశాను. తడాఖా లో కూడా సపోర్టింగ్ క్యారెక్టర్ చేశాను అని చెప్పాడు. ఆ తర్వాత కూడా అలాంటి ఛాన్సులు వచ్చాయి కానీ హీరోగా చేస్తున్న సినిమాల మార్కెట్ కి ఎఫెక్ట్ అవుతుందని నిర్మాతలు అడ్డు చెప్పడంతో కమెడియన్ పాత్రలు చేయలేదని చెప్పాడు.
ఇక ఇప్పుడు ప్రేక్షకులకు ఇంకా బాగా దగ్గరయ్యేందుకు మళ్ళీ అప్పటిలాగా నవ్విస్తాను అంటున్నాడు సునీల్. చిరంజీవి గారితో ఖైదీ నెంబర్ 150 లో ఛాన్స్ వస్తే మిస్ అయ్యాను కానీ ఇప్పుడు మిస్ అవ్వలేదు. సైరా లో నటించడానికి ఒకే చేశానని చెప్పాడు. ఎన్నోసార్లు చిరంజీవి ఫ్యాన్ అంటూ చాలా ఓపెన్ గా చెప్పేసిన సునీల్ అంటే.. మెగాస్టార్ కు కూడా చాలా ఇష్టం. అందుకే ఖైదీనెం 150లో చేయకపోయినా.. ఇప్పుడు సైరాలో చేస్తావా అని మళ్ళీ అడిగారట. దానితో మనోడు వెంటనే ఓకె చెప్పేశాడనమాట. అలాగే కథనాయకుడిగాను రెండు సినిమాల్లో నటిస్తున్నానని చెప్పాడు సునీల్.