Begin typing your search above and press return to search.
చెక్ పెట్టేసిన మాస్ మహారాజా
By: Tupaki Desk | 11 Jun 2019 5:34 AM GMTగత ఏడాది ఏకంగా మూడు ఎదురుదెబ్బలు తగిలి మార్కెట్ డేంజర్ లో పడిన నేపథ్యంలో మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమాల విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేడు. విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న డిస్కో రాజాలో సునీల్ కు బదులుగా అల్లరి నరేష్ ను తీసుకోబోతున్నట్టుగా వార్తలు కొద్దిరోజుల క్రితం కాస్త గట్టిగానే షికారు చేశాయి. యూనిట్ అధికారికంగా దీని గురించి మాట్లాడలేదు కానీ లోలోపల మాత్రం చాలా తీవ్ర స్థాయిలో చర్చలు జరిగినట్టు సమాచారం.
దాని ప్రకారం అల్లరి నరేష్ పేరుని పరిగణనలోకి తీసుకున్న మాట వాస్తవమే అయినప్పటికి సునీల్ ని తప్పించి తీసుకునే అది ప్రేక్షకులకు మరో అర్థంలో సంకేతం ఇవ్వొచ్చన్న ఉద్దేశంతో ఆ ప్రతిపాదన డ్రాప్ అయ్యారట. గతంలో రవితేజ అల్లరి నరేష్ లు కలిసి శంభో శివ శంభో చేశారు. అది ఆశించిన స్థాయిలో ఆడకపోయినా మంచి పేరైతే వచ్చింది. ఇప్పుడు ప్రత్యేకంగా ఇదే కాంబినేషన్ ని రిపీట్ చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతోనే సునీల్ తోనే కంటిన్యూ చేసే నిర్ణయం తీసుకున్నారట.
ఇప్పటికే ఎనిమిది నెలలుగా రవితేజ సినిమా రాలేదు. అమర్ అక్బర్ ఆంటోనీ తర్వాత గ్యాప్ అలాగే ఉండిపోయింది. డిస్కో రాజా ప్రకటించినప్పుడు ఆగస్ట్ అన్నారు కానీ ఇప్పుడు నవంబర్ కు షూటింగ్ పూర్తి కావడమే గొప్ప అనేలా ఉంది పరిస్థితి. ఒకవేళ అన్ని సవ్యంగా జరిగితే డిసెంబర్ రిలీజ్ ప్లాన్ చేసుకోవచ్చు. గత ఏడాది మూడు సినిమాలతో పలకరించిన రవితేజ ఈ సంవత్సరం మాత్రం ఒక్కదాంతోనే సర్దుకోమని చెప్పేలా ఉన్నాడు