Begin typing your search above and press return to search.
ఏపీలో ఏఎంబీ మాల్స్ ఉండవు!
By: Tupaki Desk | 23 Dec 2018 11:57 AM GMTగత కొంతకాలంగా అల్లు అర్జున్ థియేటర్ల బిజినెస్ లో అడుగుపెడుతున్నారని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తల్లో నిజం ఎంత? అని ప్రశ్నిస్తే నేరుగా పంపిణీదారుడు - ఏషియన్ థియేటర్స్- ఏఎంబీ మాల్స్ యజమాని సునీల్ నారంగ్ నుంచే సమాధానం వచ్చింది.
బన్నితోనూ.. అల్లు అరవింద్ గారితో ఐదేళ్ల క్రితమే ఓ భారీ బిల్డింగ్ నిర్మాణంపై మాట్లాడుకున్నాం. అమీర్ పేట సత్యం థియేటర్ మాదే. దానిని భారీ మాల్ గా మారుస్తున్నాం. మొత్తం 7000 గజాల స్థలంలో మాల్ నిర్మాణం చేపడుతున్నాం. భారీ మాల్ అందులోనే థియేటర్లు ఉంటాయి... అని తెలిపారు. భారీ ఎత్తున ఈ ప్రాజెక్టు చేస్తున్నామని - నిర్మాణ రంగంలో చాలా అనుభవం ఉందని వెల్లడించారు.
ఇక ఏఎంబీ మాల్ గురించి మాట్లాడుతూ.. మహేష్-కృష్ణ ఫ్యామిలీతో చాలాకాలంగా అనుబంధం ఉంది. మహేష్- నమ్రత గారితో అనుబంధం ఉంది. అప్పట్లోనే నాన్నగారు పద్మాలయ బ్యానర్ కు ఫైనాన్స్ చేసేవారు. ఇప్పుడు మహేష్ - నమ్రత మ్యాడమ్ గారితో కలిసి ఏఎంబీ సినిమాస్ తొలి వెంచర్ వేశామని తెలిపారు. మునుముందు మాల్స్ విస్తరణ ఉంటుందని అన్నారు. ఏపీ లోనూ ఏఎంబి మాల్స్ నిర్మిస్తారా? అని ప్రశ్నిస్తే... అలాంటి ఆలోచన లేదని అక్కడ అంత సులువు కాదని అన్నారు. చెన్నయ్ - బెంగళూరు - కేరళ లోనూ ఏఎంబీ మాల్స్ నిర్మిస్తాం. ఏపీలో థియేటర్ బిజినెస్ పోటీ ఎక్కువ. అందుకే అటు వెళ్లలేమని అన్నారు. ఏదైనా చేయాలంటే ఆసక్తి ఉండాలని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఆంధ్రాలో ప్రతిదీ పోటీయే. కాంపిటీషన్ టూమచ్.. అనీ అన్నారు.