Begin typing your search above and press return to search.

ప్రముఖ నిర్మాత కూతురుకి అరుదైన గౌరవం

By:  Tupaki Desk   |   11 July 2022 3:46 PM GMT
ప్రముఖ నిర్మాత కూతురుకి అరుదైన గౌరవం
X
తెలుగు సినిమా రంగంలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఏషియన్ నారాయన్‌ దాస్ నారంగ్ మృతితో ఆయన తనయుడు సునీల్ నారంగ్ తీవ్ర దుఃఖంలో ఉన్నారు. ఈ సమయంలో ఆయన కూతురు జాన్వీ నారంగ్‌ ప్రతిష్టాత్మక లండన్ లోని వార్విక్ యూనివర్శిటీ బిజినెస్ స్కూల్‌ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి పట్టా పొందారు. ఈ విషయం సునీల్ నారంగ్ కు చాలా పెద్ద ఊరట.

ఇండస్ట్రీలో అందరి వద్ద సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న సునీల్ నారంగ్ గారి కూతురు ప్రతిష్టాత్మక యూనివర్శిటీ నుండి పట్టా పొందిన నేపథ్యంలో ఇండస్ట్రీ వర్గాల వారు పలువురు అభినందనలు తెలిజేస్తున్నారు. సోషల్‌ మీడియా ద్వారా సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా మీడియా రంగానికి చెందిన వారు ఇంకా పలువురు అభినందిస్తున్నారు.

ఇటీవలే జాన్వీ నారంగ్ వివాహం జరిగిన విషయం తెల్సిందే. ఇండస్ట్రీ కి చెందిన ప్రముఖులు పెళ్లికి తరలి వెళ్లి వధు వరులను ఆశీర్వదించారు. పెళ్లి తంతు వైభవంగా జరిగిందంటూ మీడియాలో ప్రముఖంగా చర్చ జరిగింది. పెళ్లి గురించి ఇంకా చర్చ జరుగుతున్న సమయంలోనే నారంగ్ ఫ్యామిలీ గురించి ఈ వార్త వచ్చింది.

నారంగ్‌ ఫ్యామిలీ మొత్తం కూడా జాన్వీ కి అరుదైన గౌరవం దక్కడంతో ఆనందం తో ఉన్నారు. ఇక జాన్వీ చాలా కాలంగా ఏషియన్‌ సినిమాకు సంబంధించిన బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. కేవలం పంపిణీ రంగంలో మాత్రమే కాకుండా నిర్మాణంలో కూడా ఏషియన్‌ ను ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లేందుకు జాన్వీ నారంగ్ ప్రయత్నాలు చేస్తున్నారు.