Begin typing your search above and press return to search.
సునీల్ అంటే వేరే వాళ్లు ఖర్చు పెట్టరని..
By: Tupaki Desk | 26 Dec 2017 11:30 PM GMTదర్శకుడు ‘ఎన్ కౌంటర్’ శంకర్ కెరీర్లో చాలా వరకు సామాజిక ఇతివృత్తాలతో ముడిపడ్డ సినిమాలే చేశాడు. ఇప్పుడు సునీల్ ను హీరోగా పెట్టి ‘2 కంట్రీస్’ లాంటి వినోదాత్మకమైన సినిమాను స్వీయ నిర్మాణంలో శంకర్ తీయడం కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే. పైగా సునీల్ ఫ్లాపుల్లో ఉన్న సమయంలో శంకర్ సొంత నిర్మాణంలో ‘2 కంట్రీస్’ సినిమాను రిచ్ గా తీశాడు. ఈ చిత్ర ప్రోమోల్లో ఆ రిచ్ నెస్ స్పష్టంగా కనబడింది. మరి ఈ సినిమాను శంకరే ఎందుకు నిర్మించాడు అన్న ప్రశ్న చాలామందిలో ఉంది. ఇదే ప్రశ్న శంకర్ ను అడిగితే ఏం సమాధానం చెప్పాడంటే..
‘‘మలయాళంలో సూపర్ హిట్టయిన ‘2 కంట్రీస్’ సినిమాను తీసిన నిర్మాతలు నాకు సన్నిహితులు. వాళ్లే నన్నీ సినిమా రీమేక్ చేయమన్నారు. అప్పుడు దిలీప్ పాత్రకు నాకు తెలుగులో తట్టిన నటుడు సునీలే. ఈ సినిమాను రిచ్ గా.. ఏమాత్రం కాంప్రమైజ్ లేకుండా తీయాలనుకున్నా. ఐతే సునీల్ మార్కెట్ దెబ్బ తింది. అందువల్ల వేరే నిర్మాతను కలిస్తే అమెరికా ఎందుకు.. బ‌్యాంకాక్ లో చేద్దామని అంటారు. అది నాకు నచ్చదు. అందుకే నేను నిర్మాతగా మారాను. ఒక నిర్మాత ఆలోచనలకు, టెక్నీషియన్ ఆలోచనలకు గ్యాప్ ఉంటుంది. సినిమా వల్ల డబ్బులొచ్చినా పోయినా అది నాకే జరగాలని నేనే నిర్మాతగా మారి ఈ సినిమా చేశాను. ఇక సునీల్ ట్రాక్ రికార్డు విషయానికొస్తే.. అందరు హీరోలకూ హిట్లూ.. ఫ్లాపులూ ఉంటాయి. కాకపోతే మన పాత్రకు ఓ నటుడు సరిపోతాడనుకున్నప్పుడు హీరోల ట్రాక్ రికార్డు పట్టించుకోకూడదు. ఎందుకంటే సినిమాకు రైట్ కాస్టింగ్ అనేది చాలా ముఖ్యం’’ అని శంకర్ అన్నాడు.