Begin typing your search above and press return to search.
సునీల్.. కింకర్తవ్యం?
By: Tupaki Desk | 31 Dec 2017 5:50 AM GMTకమెడియన్ వేషాల నుంచి హీరో క్యారెక్టర్ల వైపు మళ్లిన సునీల్.. ఒక దశలో రూ.20 కోట్ల మార్కెట్ సంపాదించుకున్నాడు. ‘అందాల రాముడు’.. ‘మర్యాదరామన్న’ మంచి విజయాలు సాధించి హీరోగా అతడి కెరీర్ కు బలమైన పునాది వేస్తే.. ‘పూల రంగడు’ అతడి కెరీర్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది. కానీ హీరోగా సునీల్ కెరీర్లో అతి పెద్ద విజయాన్నందించిన ఈ చిత్రమే అతడికి చేటు కూడా చేసింది. ఈ సినిమాలో మాస్ హీరోలా హీరోయిజం చూపించిన సునీల్.. ఆ తర్వాత కూడా అదే రూటు ఫాలో అయ్యాడు. తన బలాన్ని వదిలేసి.. అవసరం లేని విన్యాసాలు చేశాడు. కథల ఎంపికలోనూ తప్పిదాలు చేశాడు. దీంతో కెరీర్ గాడి తప్పింది. గత మూడేళ్లలో అరడజనుకు పైగా ఫ్లాపులు తిన్నాడు సునీల్.
మూడు నెలల కిందటే ‘ఉంగరాల రాంబాబు’తో చేదు అనుభవం ఎదుర్కొన్న సునీల్ కు.. అతడి కొత్త సినిమా ‘2 కంట్రీస్’ కూడా ఇలాంటి అనుభవాన్నే మిగిల్చేలా ఉంది. ఈ సినిమాకు పేలవమైన టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా లేవు. పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లు కూడా పెద్దగా లేకపోవడంతో సినిమా పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదు. గత ఏడాది వరకు సునీల్ సినిమాలకు ఓపెనింగ్స్ అయినా వస్తుండేవి. ‘జక్కన్న’కు ఎంత నెగెటివ్ టాక్ వచ్చినా.. ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ‘2 కంట్రీస్’ పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. ఇది హీరోగా సునీల్ కెరీర్ కు దాదాపుగా తెరదించేసే పరిస్థితి కనిపిస్తోంది. హీరోగా వచ్చే ఏడాది ఇంకో మూడు సినిమాలు చేయబోతున్నట్లుగా సునీల్ చెప్పాడు కానీ.. అవి నిజంగా పట్టాలెక్కుతాయో లేదో చూడాలి. ఐతే ఇప్పటికే కామెడీ వేషాలకు సై అన్నాడు కాబట్టి.. సునీల్ మునుపటిలా కామెడీ పండించగలిగితే కెరీర్ ముందుకు సాగొచ్చేమో. ఐతే హీరోగా చాలా సినిమాలు చేయడం.. లుక్.. ఇమేజ్ మారిపోవడం వల్ల సునీల్ కామెడీ ఇంతకుముందులా పండుతుందా అన్నదీ సందేహమే. కమెడియన్ గా తిరిగి అతడితో అలవాటు పడటానికి కూడా కొంచెం సమయం పడుతుంది. ఐతే త్రివిక్రమ్ లాంటి దర్శకుల హ్యాండ్ పడటం ఇక్కడ కీలకం. అతను మాత్రమే సునీల్ ను మళ్లీ కమెడియన్ గా ట్రాన్స్ ఫామ్ చేయగలడు. చూద్దాం మరి సునీల్ కెరీర్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో?