Begin typing your search above and press return to search.
నా పాత్ర మరీ ఎక్కువ లేదేంటి?
By: Tupaki Desk | 12 Oct 2018 3:52 AM GMTకమెడియన్ టర్న్ డ్ హీరో సునీల్ తిరిగి క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. రూమ్ మేట్ త్రివిక్రమ్ అతడికి కీలక దశలో లిఫ్టింగ్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ``హీరోగా చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తి చెయ్. ఆ తర్వాత నేను చూస్కుంటా!`` అని ప్రామిస్ చేసిన త్రివిక్రమ్ ఆ ప్రకారమే సునీల్‌కి మరోసారి లిఫ్టిస్టున్నాడు. ఎన్టీఆర్ `అరవింద సమేత`లో తిరిగి అతడిని క్యారెక్టర్ నటుడిగా చూపించాడు. అయితే ఆ పాత్ర నిడివి చాలా తక్కువ. సీన్లు పరిమితంగానే ఉన్నాయన్న మాటా వినిపించింది. అయితే తన రోల్ మరీ చిన్నదిగా ఉన్నందుకు సునీల్ ఫీలయ్యారా? అంటే.. అందుకు సునీల్ నే సమాధానం చెప్పాడు.
నిన్నటిరోజున అరవింద సమేత సక్సెస్ వేదికపై సునీల్ మాట్లాడుతూ -``ఈ సినిమాతో తిరిగి క్యారెక్టర్ నటుడిగా రీఎంట్రీ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. అయితే కొందరు మాత్రం నా పాత్ర మరీ ఎక్కువ లేదేంటి? అని అడిగారు. బిరియానీలో ఏది ఎంత ఉండాలో అంతే ఉండాలి. ఏది ఎక్కువయినా తేడా కొడుతుంది. అందుకే ఇందులో ఎంత అవసరమో అంతే కనిపించాను. నేను నటించిన సీన్ల నే ఎక్కువ కట్ చేయించాడు త్రివిక్రమ్. అయినా అవసరం అయిన కామెడీ సీన్లే ఉంచడం వల్ల అన్నీ కుదిరాయి. యాక్షన్ - ఫ్యాక్షన్ సినిమాని ఫ్యామిలీ సినిమాని చేశాడు త్రివిక్రమ్. ఫ్యాక్షన్ సినిమాల్లో మంచి క్లాసిక్ ని ఇచ్చాడు. అందులో నాకు ఛాన్సిచ్చినందుకు థాంక్స్`` అన్నారు.
``నేను ప్రేక్షకులతోనే సినిమా చూశాను. నా క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. ఈ మధ్య కాలంలో రానంత ఆనందం కలిగింది మూవీ చూశాక. ఎందుకంటే ఓ మంచి క్యారెక్టర్ లో ఇలా నన్ను నేను చూసుకుని చాలా కాలమైంది. చాలా తృప్తిగా ఉంది`` అని సంతోషం వ్యక్తం చేశారు సునీల్. మొత్తానికి మనసులో చిన్న ఫీలింగ్ ఉన్నా కానీ, సినిమా హిట్టు కొట్టడం అన్నది ఇంపార్టెంట్ కాబట్టి నలుగురితో నారాయణ అనిపించాడన్నమాట!! సునీల్ నటించిన `సిల్లీ ఫెలోస్` బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. తదుపరి `సైరా-నరసింహారెడ్డి`లో ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. సునీల్ దాదాపు 180 సినిమాల్లో నటించి 200 సినిమాల క్లబ్ వైపు పయనిస్తున్న సంగతి తెలిసిందే.