Begin typing your search above and press return to search.

చిరు రేయింబవళ్లు కష్టపడుతున్నాడట

By:  Tupaki Desk   |   25 Jun 2016 5:13 AM GMT
చిరు రేయింబవళ్లు కష్టపడుతున్నాడట
X
తన రీఎంట్రీ మూవీని మొదలుపెట్టే విషయంలో చాలా తాత్సారం చేశాడు మెగాస్టార్ చిరంజీవి. కానీ సినిమా మొదలయ్యాక మాత్రం ఆయన ఏమాత్రం ఆగేట్లు లేరు. తొలి షెడ్యూళ్లోనే ఆయన రేయింబవళ్లు కష్టపడిపోతున్నాడు. నిన్న ‘జక్కన్న’ ఆడియో వేడుక సందర్భంగా ఈ విషయం వెల్లడైంది. రెండు రోజుల ముందు సునీల్ ఫోన్ చేసి ‘జక్కన్న’ ఆడియో వేడుకకు రావాలని అడిగాడట. ఐతే ఇప్పుడే తన రీఎంట్రీ మూవీ షూటింగ్ మొదలైందని.. అంతలోనే అంటే కష్టమని.. రాత్రి పూట కూడా షూటింగ్ చేస్తున్నామని చెప్పాడట చిరు. ఐతే సునీల్ అంతగా అడిగేసరికి కాదనలేకపోయానని.. తాను లేటుగా వస్తానని చెప్పి.. షూటింగ్ పూర్తయ్యాక ఆలస్యంగా వచ్చానని చెప్పాడు చిరు.

దానికంటే ముందు సునీల్ మాట్లాడుతూ.. ఆడియో కార్యక్రమం పూర్తయ్యాక మళ్లీ చిరంజీవి సెట్టుకెళ్లి రాత్రంతా షూటింగులో పాల్గొనబోతున్నట్లు వెల్లడించాడు. మరీ తొలి షెడ్యూళ్లోనే చిరు ఈ స్థాయిలో కష్టపడుతుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. చిరు అందుకే మెగాస్టార్ అయ్యాడని.. భరించే వాళ్లకే దేవుడు ఇంత కష్టం.. బాధ్యత ఇస్తాడని చిరును ఆకాశానికెత్తేశాడు సునీల్. తనకు అన్నయ్యే స్ఫూర్తి అని.. ఆయన్ని చూసే డ్యాన్సులు నేర్చుకున్నానని.. సినిమాల్లోకి వచ్చానని.. తన మీద అభిమానంతో ఎంతో కష్టమైనప్పటికీ ఆలోచించుకుండా చిరంజీవి ఆడియో వేడుకకు రావడం చాలా గొప్ప విషయమని అంటూ.. దీనికి ఏం చేసినా రుణం తీర్చుకోలేనని ఉద్వేగానికి లోనయ్యాడు సునీల్.