Begin typing your search above and press return to search.
తిక్క డైరెక్టర్ ఇంత ఓపెనేంటండీ బాబూ..
By: Tupaki Desk | 31 July 2016 11:30 AM GMTఒకరికి ఒకరు.. మిస్టర్ మేధావి.. భగీరథ.. నేను మీకు తెలుసా?.. సినిమాటోగ్రాఫర్ గా చెప్పుకోదగ్గ సినిమాలే చేశాడు సునీల్ రెడ్డి. ఐతే అతడికి మెగా ఫోన్ పట్టాలన్నది కల. ఆ కల నేర్చుకునే క్రమంలో తొలి అడుగు బలంగా పడాలనుకున్నాడు. తెలుగులో తొలి యాక్షన్ త్రీడీ సినిమాతో సంచలనం సృష్టిద్దామనుకున్నాడు. కళ్యాణ్ రామ్ రూపంలో ప్యాషన్ ఉన్న హీరో కమ్ ప్రొడ్యూసర్ తోడయ్యాడు. ఇద్దరూ కలిసి ఎంతో కష్టపడి ‘ఓం 3డి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. దాదాపు రూ.25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా అది. దారుణమైన ఫలితాన్ని చవిచూసింది. కళ్యాణ్ రామ్ కు భారీ నష్టాల్ని.. సునీల్ రెడ్డికి చాలా చెడ్డపేరును తీసుకొచ్చింది. ఆ చేదు అనుభవం నుంచి తేరుకుని.. మళ్లీ ‘తిక్క’ సినిమాతో తనేంటో రుజువు చేసుకోవాలని చూస్తున్నాడు సునీల్.
ఐతే మామూలుగా తాను తీసిన సినిమా పెద్ద ఫ్లాప్ అయితే.. దాని గురించి మాట్లాడ్డానికి ఏ దర్శకుడూ ఇష్టపడడు. ఒకవేళ ప్రస్తావించాల్సి వచ్చినా పొడిపొడిగా మాట్లాడేస్తాడు. కానీ సునీల్ రెడ్డి మాత్రం ‘తిక్క’ ఆడియో వేడుకలో తన తొలి సినిమా ఫలితం గురించి మరీ ఓపెన్ గా మాట్లాడేశాడు. ‘‘నా తొలి సినిమా ఓం 3డి ఎంత పెద్ద ఫ్లాపో కొత్తగా చెప్పాల్సిన పని లేదు’’ అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టి అందరికీ షాకిచ్చాడు. అంత పెద్ద ఫ్లాప్ తీసినా తనను మళ్లీ నమ్మి సినిమా చేయడానికి ముందుకు రావడం మామూలు విషయం కాదని.. ఇందుకు హీరో సాయిధరమ్ తేజ్ కు.. నిర్మాత రోహిన్ రెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటానని చాలా ఉద్వేగంగా మాట్లాడాడు సునీల్. నిజాయితీగా ఇలా తన సినిమా గురించి ఒప్పుకోవడం గొప్ప విషయమే. ‘తిక్క’ సినిమా ‘ఓం 3డి’ జ్నాపకాల్ని చెరిపేసి సునీల్ ను సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూద్దాం.