Begin typing your search above and press return to search.

సునీల్ అలా చేశాడా!?

By:  Tupaki Desk   |   9 Jan 2018 10:40 AM GMT
సునీల్ అలా చేశాడా!?
X
స్టార్ కమెడియన్ అనిపించుకుని.. అక్కడి నుంచి హీరోగా మారి మొదట్లో సక్సెస్ లు చూశాడు సునీల్. గత కొన్నేళ్లుగా ఈ కామెడీ హీరోకు కాలం కలిసిరాలేదు. దీంతో మళ్లీ కమెడియన్ గా మారేందుకు ప్రయత్నిస్తున్నాడనే టాక్ ఉంది. సునీల్ కూడా ఈ విషయాన్ని చూచాయగా కన్ఫాం చేశాడు.

అయితే.. ఇప్పుడు సునీల్ కు మళ్లీ అప్పటి రేంజ్ లో ఆఫర్స్ ఇచ్చేదెవరు అన్నదే అసలు పాయింట్. త్రివిక్రమ్ సినిమాలో తనకు ఆఫర్ గ్యారంటీ అని.. మళ్లీ తన కెరీర్ ను మలుపు తిప్పేది మాటల మాంత్రికుడే అని సునీల్ హోప్స్ పెట్టుకున్నాడు. మరోవైపు తన ప్రయత్నాలను కూడా కంటిన్యూ చేస్తున్నాడట. రీసెంట్ గా రాజా ది గ్రేట్ అంటూ తన మాస్ సత్తా చూపించిన రవితేజ.. ఇప్పుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మూవీ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తనకు ఓ రోల్ ఇవ్వాలంటూ రవితేజను స్వయంగా అడిగాడట సునీల్. మాస్ మహరాజ్ రికమెండేషన్ మేరకు.. ఓ మంచి పాత్రను సృష్టించి మరీ డేట్స్ గురించి డిస్కషన్స్ కోసం సునీల్ దగ్గరకు వెళితే.. అక్కడ కళ్యాణ్ కృష్ణకు షాకిచ్చాడట సునీల్.

ప్రస్తుతం తాను చాలా బిజీగా ఉన్నానని.. ఈ సినిమా చేస్తానో లేదో తెలీదని.. దర్శకుడు అడిగిన డేట్స్ లో వేరే షూటింగ్ ఉందని చెప్పాడట సునీల్. దీంతో దర్శకుడు.. ఆ రోల్ ను ఆలీతో రీప్లేస్ చేసేశాడని అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు తెలీవు కానీ.. సునీల్ ఇలా మాట్లాడాడనే న్యూస్ మాత్రం వైరల్ అయిపోతోంది.