Begin typing your search above and press return to search.
త్రివిక్రమ్ కు అలా అనిపిస్తే క్షణం ఆగడు
By: Tupaki Desk | 18 Feb 2016 7:25 AM GMTత్రివిక్రమ్ - సునీల్ ఎంత మంచి స్నేహితులో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇద్దరూ ఒకే ఊరి (భీమవరం) నుంచి వచ్చి ఒకేసారి సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒకే గదిలో ఉండి అవకాశాల కోసం కష్టపడ్డారు. ముందు అవకాశం దక్కించుకున్న త్రివిక్రమ్.. సునీల్ కూ ఛాన్సులిప్పించాడు. అతడి కోసం తన సినిమాల్లో మంచి మంచి పాత్రలు రాశాడు. సునీల్ ను ఓ స్థాయికి తీసుకొచ్చాడు. ఐతే తర్వాత సునీల్ హీరో అయిపోయాక ఎవరి దారి వారిది అన్నట్లు తయారైపోయింది. సునీల్ కమెడియన్ గా వేషాలు మానేయడంతో ‘ఖలేజా’ తర్వాత ఇద్దరూ పని చేయడానికి అవకాశం లేకపోయింది. ఐతే త్రివిక్రమ్ దర్శకత్వంలో సునీల్ హీరో సినిమా చేస్తే ఎలా ఉంటుందన్న ఓ ఆలోచన ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతూ ఉంది చాన్నాళ్ల నుంచి.
ఇదే సంగతి సునీల్ దగ్గర ప్రస్తావిస్తే.. ‘‘నన్ను హీరోగా పెట్టి సినిమా తీయమని త్రివిక్రమ్ ను అడగను. నాతో చేయాలనిపిస్తే ఆయనే చేస్తాడు కదా? ఐతే అప్పుడప్పుడు అంటుంటాను.. ‘ఏరా.. ఇక్కడ ఖాళీ.. వచ్చేయనా’ అని. ‘ముందు నీ దగ్గర వున్నవి కానివ్వరా.. ఏదీ లేకపోతే అప్పుడు నేనున్నాగా’ అంటాడు. నా కెరీర్లో త్రివిక్రమ్ చాలా హెల్ప్ చేశాడు. అందాల రాముడు సినిమా వరకు అతనే వెనక ఉండి నడిపించాడు. పేరూ తీసుకోలేదు, డబ్బూ తీసుకోలేదు. అప్పుడే నాకే అనిపించింది.. అతడి టాలెంటుని వేరే వాళ్ల అకౌంట్ లోకి వెయ్యడం కరెక్టా అని. అందుకే ఆపేశాను. ఇప్పటికైనా సరే.. నిజంగా నేనే చేయాలనుకునే పాత్ర త్రివిక్రమ్ కు తడితే క్షణం ఆగడు అని తెలుసు’’ అని చెప్పాడు సునీల్. అంటే అందాల రాముడు వరకు తనవి కాని సినిమాలకు కూడా సునీల్ కోసం రాత సాయం చేశాడన్నమాట త్రివిక్రమ్.