Begin typing your search above and press return to search.

ఆది సినిమాలో సునీల్ సాలిడ్ క్యారెక్టర్.. ఫస్ట్ లుక్ వైరల్!

By:  Tupaki Desk   |   25 Jun 2021 8:30 AM GMT
ఆది సినిమాలో సునీల్ సాలిడ్ క్యారెక్టర్.. ఫస్ట్ లుక్ వైరల్!
X
టాలీవుడ్ యువహీరో ఆది సాయికుమార్ కెరీర్ పరంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సినిమాలు చేయడం గాని.. సినిమాల సంఖ్యలో మాత్రం తగ్గేదే లే అనిపించుకుంటున్నాడు. ఇప్పటివరకు హిట్ పడి చాలకాలం అయినా వరుసగా ప్లాప్స్ ఎదుర్కొంటున్నా హీరో కొత్త సినిమాలు కూడా వరుసగా లైన్ చేసేస్తున్నాడు. ఇటీవలే విజన్ సినిమాస్ బ్యానర్ పై నాగం తిరుపతి రెడ్డి నిర్మాతగా కిరాతక సినిమా ప్రకటించాడు. ఆ సినిమాకు పూలరంగడు ఫేమ్ వీరభద్రం దర్శకత్వం వహించనున్నాడు. అయితే ఇంతలోనే మరో కొత్త సినిమా ప్రకటించేసాడు.

కళ్యాణ్ జి గోగాన దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమా కూడా విజన్ సినిమాస్ బ్యానర్ లోనే నిర్మితమవుతుంది. ప్రస్తుతం ఆది తనకు వచ్చిన అవకాశాలు దక్కించుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. తాజాగా డైరెక్టర్ కళ్యాణ్ జి గోగానా ఇంకా పేరు ఖరారు కానీ సినిమా గురించి మాట్లాడుతూ.. "ఈ కథ చాలా కొత్తగా ఉంటుంది. ఈ కథకు ఆది సాయికుమార్ అయితేనే సెట్ అవుతాడని భావించి కథ వినిపించాను. కథ వినగానే బాగా నచ్చి ఆది ఏమాత్రం ఆలోచన చేయకుండా ఓకే చేశారు. ఈ సినిమా ఆది కెరీర్ కు తప్పకుండా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను.

ఈ సినిమాలో యాక్టర్ సునీల్ ఒక కీలకమైన పాత్రను పోషించనున్నాడు. అడిగిన వెంటనే సునీల్ గారు ఒప్పుకున్నారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు. త్వరలోనే షూటింగుకు వెళ్లనున్నాం." అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే సినిమాలో సునీల్ లుక్ సంబంధించి పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ చూస్తే సినిమాలో సునీల్ చాలా పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తున్నట్లు అర్ధమవుతుంది. ఎందుకంటే ఆ కూర్చునే స్టయిల్.. స్టైలిష్ కళ్ళజోడు.. కొంచం యాంగ్రీ లుక్ సాలిడ్ పర్సెనాలిటీ.. ఇలా ఇవన్నీ సినిమాలో ఎలా ఉంటుందో ఆలోచించండి. ప్రస్తుతం సునీల్ ఫస్ట్ లుక్ వైరల్ అవుతోంది. ఈ సినిమాకు సాయికార్తీక్ సంగీతం అందిస్తున్నాడు.