Begin typing your search above and press return to search.

'పుష్ప' కథ మలుపుతో సునీల్‌ కెరీర్‌ మలుపు తిరిగేనా?

By:  Tupaki Desk   |   13 Feb 2021 2:57 AM GMT
పుష్ప కథ మలుపుతో సునీల్‌ కెరీర్‌ మలుపు తిరిగేనా?
X
కమెడియన్‌ కమ్‌ హీరో అయిన సునీల్‌ ప్రస్తుతం అవి ఇవి చేస్తూ కెరీర్‌ లో మళ్లీ బిజీ అయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు. హీరోగా ఆఫర్లు రాకపోవడంతో కమెడియన్‌ గా మారిన సునీల్‌ కు ఆశించిన స్థాయిలో సక్సెస్‌ రాలేదు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేసినా మరే దర్శకుడి దర్శకత్వంలో చేసినా కూడా సునీల్ కు ఆశించిన స్థాయిలో మళ్లీ గుర్తింపు అయితే రావడం లేదు. దాంతో సునీల్‌ మెల్లగా విలన్ అవతారం ఎత్తేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే రెండు సినిమాల్లో నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించి మెప్పించే ప్రయత్నం చేసిన సునీల్‌ పుష్ప సినిమాలో పూర్తి స్థాయి విలన్ పాత్రలో నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా రూపొందుతున్న పుష్ప సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ప్రతి ఒక్క నటీ నటుడిని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ సుకుమార్‌ పుష్పను రూపొందించే పనిలో ఉన్నాడు. మొన్నటి వరకు పుష్ప సినిమాలో సునీల్ నటిస్తున్న వార్తలు నిజం కాకపోవచ్చు అన్నారు. కాని తాజాగా విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప సినిమాలో సునీల్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. నెగటివ్ షేడ్స్ ఉండే ఆయన పాత్ర కథను పూర్తిగా మలుపు తిప్పుతుందని అంటున్నారు. కెరీర్‌ ను ఈదుతున్న సునీల్‌ కు పుష్పలో స్టోరీ టర్నింగ్ పాత్ర ఏమేరకు ఆయన కెరీర్‌ కు టర్న్‌ ను తీసుకు వస్తుందో చూడాలి.