Begin typing your search above and press return to search.
మనోళ్ల మైండ్ సెట్ పై సునీల్ సెటైర్
By: Tupaki Desk | 15 April 2019 1:30 AM GMTకమెడియన్ అంటే ఎలా ఉండాలి? అందుకు రూల్స్ ఏవైనా ఉన్నాయా? లావుగా ఉంటేనే కమెడియనా? బస్తాలా ఫ్యాట్ గా కనిపిస్తేనే కమెడియనా? సిక్స్ ప్యాక్ లో కనిపిస్తే చూడరా? అసలింతకీ మన ప్రేక్షకుల మైండ్ సెట్ ఎలా ఉంది? అసలు కమెడియన్ ఎలా ఉండాలని మన ఆడియెన్ కోరుకుంటారు? హాలీవుడ్, పాశ్చాత్య దేశాల్లో కమెడియన్ లుక్ ఎలా ఉండాలని అనుకుంటారు? ఈ ప్రశ్నలన్నిటికీ టోకున ఒకే టిక్కెట్టుపై పది ఆన్సర్లు ఇచ్చేశారు కమెడియన్ కం హీరో సునీల్. మనోళ్ల అభిరుచి పైనా.. మైండ్ సెట్ పైనా లైట్ గా తనదైన శైలిలో పంచ్ వేశారు. సెటైర్ వేసీ వేయనట్టు.. నొప్పి తెలిసీ తెలియనట్టు ఒప్పించేశారు!
ఇంతకీ సునీల్ ఏమని అన్నారు? అసలు మనోళ్ల మైండ్ లో కమెడియన్ అంటే ఎలా ఉండాలని అనుకుంటున్నారు అంటే.. ఇంకా పాత సునీల్ లా కనిపిస్తేనే కమెడియన్ అనుకుంటున్నారని అన్నారు. అలా కనిపించడానికి తాను తిరిగి పాత రూపానికి వెళ్లేందుకు ప్రస్తుత రూపాన్ని చెడగొడుతున్నానని తెలిపారు. మీరు హీరో అయ్యాక 6 ప్యాక్ చేశారు. ఎందుకని ఇప్పుడు వదిలేశారు? అని ప్రశ్నిస్తే... కామెడీ యాక్టర్ అంటే నా పాత బాడీ లాంగ్వేజ్ కనిపించాలని మన వాళ్లు కోరుకుంటున్నారు. అలా అయితేనే కామెడీ యాక్టర్ లా కనిపిస్తున్నానేమో. బార్ టెండర్ లా 6 ప్యాక్ బాడీ బిల్డ్ చేస్తే కమెడియన్ గా చూడటం లేదని కాస్త వ్యంగ్యంగానే స్పందించారు.
యాక్షన్ హీరోగా మారడం వల్లనే మిమ్మల్ని కమెడియన్ గా చూడటం లేదా? అన్న ప్రశ్నకు.. అసలు నేను యాక్షన్ హీరో అవ్వాలని అనుకోలేదు. ఒక జోల్ట్ ఇద్దామని ప్రయత్నించాను అంతే. టాలీవుడ్ లో యాక్షన్ కామెడీ చేసే హీరో లేరు ప్రయత్నించవచ్చు కదా! అని ఒకరు సలహా ఇచ్చారు. దానిని అమల్లో పెట్టాను అని అన్నారు. ఉన్న ప్లేస్ ని బట్టి.. ఆలోచన మారుతుంది. జాకీచాన్ కామెడీ హీరో.. తనని ప్రపంచవ్యాప్తంగా ఆదరించారు. అతడికి ఆదరణ దక్కింది.. అలా ఒక ప్రయత్నం చేశాననిక ఉదాహరణ చెప్పారు. మనకు ఫాదర్ పాత్రలకు పొట్టలు ఉంటాయి.. చైనాలో తండ్రి పాత్రకు 6ప్యాక్ ఉంటుంది. చైనీ - హాలీవుడ్ సినిమాలు చూసే ఆడియెన్ మైండ్ సెట్ వేరు. మనకు వేరే. ల్యాండ్ ను బట్టి మైండ్ సెట్ మారుతుంది. అక్కడ అలా.. ఇక్కడ ఇలా ఆలోచిస్తున్నారు! అంటూ తన అనుభవాన్ని ఓపెన్ గానే చెప్పేశారు సునీల్ భయ్యా. `చిత్రలహరి` సక్సెస్ ని ఆస్వాధిస్తున్నానని.. ఈ సినిమా తనకు మరో పిల్లర్ గా నిలిచిందని సునీల్ ఆనందం వ్యక్తం చేశారు.