Begin typing your search above and press return to search.
కెఏ పాల్ పాత్రలో సునీల్! ఉత్త ప్రచారమా?
By: Tupaki Desk | 26 Jun 2019 6:50 AM GMTక్రైస్తవ మత ప్రభోదకుడు కె.ఏ.పాల్ వ్యవహారిక శైలి గురించి తెలిసిందే. ఎన్నికల ముందు రాజకీయ పార్టీని స్థాపించి ఆయన చేసిన హంగామాను ప్రజలు అంత తేలిగ్గా మర్చిపోలేరు. పాల్ వింత చేష్టల్ని హైలైట్ చేస్తూ టీవీ చానెళ్లు టీఆర్పీ గేమ్ ఆడాయి. ఆయన వింత మాటలు.. విచిత్రమైన చేష్టలు.. ఓ రేంజులో కామెడీని పండించడంపై ప్రజల్లో ఆసక్తికర చర్చ సాగింది. సీరియస్ పొలిటికల్ గేమ్ లో ఆయనో రిలీఫ్ అంటూ కొందరు సమర్థించారు కూడా.
అయితే పాల్ చేష్టల్నే హైలైట్ గా చూపిస్తూ ఆయనపై సినిమా తీసేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడీ అవుతోందని ప్రచారమవుతోంది. కె.ఏ పాల్ పాత్రలో కమెడియన్ టర్న్ డ్ హీరో సునీల్ నటిస్తారని .. ఈ సినిమాకి ఓ కొత్త దర్శకుడు పని చేస్తారని చెబుతున్నారు. పాల్ పాత్ర ఆధారంగా పొలిటికల్ థ్రిల్లర్ కథాంశాన్ని తీర్చి దిద్దారని ... టైటిల్ పాత్రలో సునీల్ సరైన ఆప్షన్ అని నిర్మాతలు భావిస్తున్నారని తామరతంపరగా వెబ్ మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే ఇందులో నిజం ఎంత? అన్నదానిపై సరైన క్లారిటీ లేదు.
అయినా సినిమా పేరుతో తనని ఇమ్మిటేట్ చేస్తానంటే పాల్ ఒప్పుకుంటారా? ఇమ్మిటేషన్ తో అగౌరవపరిస్తే ఊరుకుంటారా? అన్నది ఓ చిక్కు ప్రశ్న. ఒక మతప్రభోదకుడిగా అతడికి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అంతర్జాతీయంగానూ గుర్తింపు ఉంది. అందుకే ఒకవేళ కె.ఏ.పాల్ పై సినిమా తీయాలంటే ముందే అతడి అనుమతి తీసుకోకపోతే రిలీజ్ పరంగా సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి పాల్ పై సినిమా తీస్తున్న మేకర్స్ ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకుంటారా? లేదూ సినిమా అంటూ ఇదంతా ఉత్తప్రచారంగానే భావించాలా? అన్నది చూడాలి.