Begin typing your search above and press return to search.

సింగర్‌ సునీత పెళ్లి డేట్‌

By:  Tupaki Desk   |   8 Dec 2020 12:05 PM GMT
సింగర్‌ సునీత పెళ్లి డేట్‌
X
ప్రముఖ సింగర్‌ సునీత రెండవ పెళ్లికి సిద్దం అయ్యింది. గత కొన్ని సంవత్సరాలుగా సునీత పెళ్లికి సంబంధించిన వార్తలు మీడియా వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగాయి. ఎట్టకేలకు పుకార్లు నిజం అయ్యాయి. సునీత పెళ్లకి రెడీ అయ్యారు. మ్యాంగో మీడియా గ్రూప్‌ అధినేత రామ్‌ వీరపనేనిని సునీత పెళ్లి చేసుకోబోతున్నారు. ఆయన కూడా గతంలో భార్యకు విడాకులు ఇచ్చి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ఇద్దరు కలిసి కొత్త జీవితం ప్రారంభించేందుకు సిద్దం అయ్యారు. సునీత పెళ్లికి సంబంధించి ఇరు కుటుంబాలకు సంబంధించిన చర్చలు పూర్తి అయ్యాయి.. నిన్న వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది.

పెళ్లికి మరీ ఎక్కువ ఆలస్యం చేయకుండా పెద్దగా ప్రముఖులను సెలబ్రెటీలను ఆహ్వానించకుండా కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపబోతున్నారట. మీడియా వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం జనవరి మూడవ వారంలో అంటే సంక్రాంతి అయిన వెంటనే పెళ్లికి ముహూర్తం పెట్టినట్లుగా సమాచారం అందుతోంది. పెళ్లికి సినీ ప్రముఖులను మరియు స్నేహితులను కూడా సునీత పిలవడం లేదు అంటున్నారు. పెళ్లి తర్వాత చిన్న పార్టీని ఏర్పాటు చేసి స్నేహితులను ఆహ్వానించాలనే అభిప్రాయంతో సునీత ఉన్నారని సమాచారం అందుతోంది.