Begin typing your search above and press return to search.

నా లైఫ్ కి దగ్గరగా ఉండే షార్ట్ ఫిలిం -సునీత

By:  Tupaki Desk   |   11 Sept 2016 3:00 PM IST
నా లైఫ్ కి దగ్గరగా ఉండే షార్ట్ ఫిలిం -సునీత
X
గాయని సునీత తొలిసారిగా ఓ షార్ట్ ఫిలిం చేసింది. రాగం పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం తన వాస్తవ జీవితానికి దగ్గరగా ఉంటుంది అని చెబుతోంది. ఆ షార్ట్ ఫిలింలో ఈమె చేసినది ప్రవల్లిక జర్నలిస్ట్ పాత్ర అయితే.. సింగర్ లైఫ్ కి దగ్గరగా ఎలా అనే క్యూరియాసిటీ సహజం. అందుకే ఆ వివరాలను కూడా డీటైల్డ్ గా చెప్పింది సునీత.

'అసలు నేను యాక్టింగ్ కి సరిపోనని నా ఉద్దేశ్యం. అందుకే సినిమాల్లో పలు ఆఫర్స్ వచ్చినా ఎప్పుడూ ఒప్పుకోలేదు. కానీ రాగం ఫిలింలో ఎవరిపైనా ఆధారపడని మహిళ పాత్ర పోషిస్తున్నా. వృత్తి రీత్యా జర్నలిస్ట్ అయినా.. పాడడం అంటే ఆ పాత్రకు చాలా ఇష్టం. వర్క్ ప్లేస్ లలో ప్రతీ రోజు మహిళలు ఎదుర్కునే ఎన్నో సమస్యలను ఇది డీల్ చేస్తుంది. ఎంతో మందికి ఆలోచనలకు రేకెత్తించే కాన్సెప్ట్ ఇది' అన్న సునీత.. ఈ మూవీకి ఎక్కువ మంది మహిళలే పని చేయడాన్ని గుర్తు చేసింది. ముఖ్యంగా చైతన్యకు అవకాశం ఇవ్వడంలో తన ఉద్దేశ్యం కూడా ప్రోత్సహించడమే అని చెప్పింది సునీత.

'ఇప్పుడు నేను ఉన్న ఫీల్డ్ లో ఎన్నో చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనసులో ఎన్ని భావాలు ఉన్నా మొహంపై చిరునవ్వును కంటిన్యూ చేయాలి. రాగం కూడా ఇలాంటి కేరక్టరే. నా రియల్ లైఫ్ కి దగ్గరగా ఉండడంతోనే చాలా సీన్స్ ను సింగిల్ టేక్ లో చేయగలిగా' అంటోంది సింగర్ కం యాక్టర్ సునీత.