Begin typing your search above and press return to search.
సునీత సింగింగ్ అకాడెమీ వస్తోందోచ్
By: Tupaki Desk | 15 Dec 2015 5:55 AM GMTసునీత.. పరిచయం అక్కర్లేని పేరు ఇది. సింగర్ - డబ్బింగ్ ఆర్టిస్ట్ - బుల్లితెర యాంకర్.. ఆల్ రౌండర్ గా అందరికీ సుపరిచితం. గాయనిగా తెలుగు - తమిళ్ - కన్నడలో 3 వేల పైచిలుకు పాటలు పాడిన ఆమె చిన్నారులను ఆ కళలో తీర్చిదిద్దేందుకు త్వరలోనే సంగీత అకాడమీ ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ -''ఇటీవలి కాలంలో ఆర్ పీ పట్నాయక్ తులసీదళం - ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో ధనుష్ - పార్వతీ సలీంకుమార్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న 'మరియన్' సినిమాలకు పాడాను. అలాగే ఎప్పటికప్పుడు విదేశీ పర్యటనల్లోనూ బిజీ. గత మూడేళ్లుగా అమెరికా - ఆస్ట్రేలియా - చైనా - జపాన్ - మలేసియా - సింగపూర్ - దుబాయ్ తదితర దేశాలు పర్యటించి ఎన్నో ప్రోగ్రామ్స్ లో పార్టిసిఫై చేశాను. నాకు ఓ యాంబిషన్ ఉంది. చిన్నారుల కోసం సంగీత అకాడమీ ఏర్పాటు చేయాలన్నదే ఆ యాంబిషన్. హైదరాబాద్ లేదా విజయవాడల్లో ఏదో ఒక చోట పెడతాను. వివరాలు త్వరలోనే వెల్లడిస్తాను.'' అని ఎన్నో సంగతుల్ని సునీత చెప్పారు.
సినిమాలలో కూడా నటిస్తారా? అన్న ప్రశ్నకు.. ''ఈ గుర్తింపు చాలండీ, ఇంకా నటన కూడా ఎందుకు? యాక్టింగుపై అంత ఆసక్తి లేదు'' అన్నారు సునీత. వాస్తవానికి గాయనిగా, అనువాద కళాకారిణిగా సునీతకు ఉన్న గుర్తింపునకు నటనా రంగం పెద్ద కష్టమేమీ కాదు. ఎన్నోసార్లు దర్శకనిర్మాతలు అవకాశాలిచ్చినా సునీత అయిష్టంతో తిరస్కరించారు. అదీ మ్యాటరు.