Begin typing your search above and press return to search.
JNU ఘటనపై సన్నీ సూపర్ కామెంట్
By: Tupaki Desk | 10 Jan 2020 1:30 AM GMTదిల్లీ జె.ఎన్.యు ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఎవరికి వారు ఒపీనియన్లు ఓపెన్ గా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు విద్యార్థులపై దాడిని తీవ్రంగా ఖండించారు. దీపీకా పదుకొణే- కంగనా రనౌత్ సహా టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ ఆ ఘటన అమానుషం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. సీఏఏ బిల్లుకు వ్యతిరేకంగా జరిగిన ఈ వివాదం ప్రస్తుతం కొంతపుంతలు తొక్కుతోంది. నెటిజనులు రెండుగా డివైడ్ అయ్యి ఎవరిని సమర్ధిస్తున్నారో అర్థం కాని పరిస్థితి.
తాజాగా బాలీవుడ్ నటి సన్నిలియోన్ విద్యార్థులకు మద్దతుగా స్వరం వినిపించింది. ఓ సమావేశంలో సన్నీ ఘటనను ఖండించింది. తాను మాట్లాడుతున్న అతి పెద్ద సమస్యగా చెప్పుకొచ్చింది. హింసను ఎప్పుడూ సమర్ధించలేదని..దాడుల వల్ల బాధితులు మాత్రమే కాదు..ఆ కుటుంబాలు ఎంతో బాధపడుతున్నాయని ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా విద్యార్థి లోకంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని అంది. హింసకు దారివ్వకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటే బాగుండేదని అభిప్రాయపడింది.
సన్ని వ్యాఖ్యలపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సన్ని చక్కగా మాట్లాడిందని.. సమస్య గురించి చాలా విషయాలు లోతుగా ఆలోచించి స్పందించిందని సోషల్ మీడియాలో వ్యాఖ్యల్ని పోస్ట్ చేస్తున్నారు. ఇంకా ఈ ఘటనపై పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు స్పందించాల్సి ఉంది. ఇది దేశ ప్రధాని మోదీ ప్రభుత్వానికి సంబంధించిన అంశం కావడంతో చాలా మంది స్పందించలేదు. సీఏఏ బిల్లుపై భిన్న స్వరాలు వినిపించడంతోనే అమితాబ్ బచ్చన్ సహా పేరున్న నటులు ఎవరూ స్పందించలేదు. టాలీవుడ్ నుంచి బన్ని తప్ప ఇంకెవ్వరు రెస్పాండ్ అవ్వలేదు.