Begin typing your search above and press return to search.

సన్నీకి అండర్‌ గ్రాడ్యుయేషన్‌ సీటు వచ్చింది

By:  Tupaki Desk   |   28 Aug 2020 4:00 PM IST
సన్నీకి అండర్‌ గ్రాడ్యుయేషన్‌ సీటు వచ్చింది
X
ఇండియాలో సన్నీలియోన్‌ కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంటర్నెట్‌ బేసిక్‌ గా ఐడియా ఉన్న వారికి ఆమె తెలిసి ఉంటుందని ఒక టాక్‌ ఉంది. అది నిజం కూడా అనడంలో సందేహం లేదు. తన పాత వృత్తిని వదిలేసి బాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తూ ఇండియాలోనే ఉంటున్న సన్నీలియోన్‌ రెగ్యులర్‌ గా మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఈమెకు కోల్‌ కత్తాలోని ఒక అండర్‌ గ్రాడ్యుయేషన్‌ కాలేజీలో సీటు రావడం చర్చనీయాంశం అయ్యింది. కాలేజ్‌ వారు ప్రకటించిన మెరిట్‌ జాబితాలో ఆమె పేరు మొదటే ఉంది. ఆమెకు బిఏ కామర్స్ లో సీటు ఇస్తున్నట్లుగా ఆ లిస్ట్‌ లో పేర్కొనడం జరిగింది.

సన్నీలియోన్‌ వివరాలతో ఎవరో కాలేజ్‌ లో సీటు కోసం దరకాస్తు చేశారు. 12వ తరగతి బోర్డ్‌ పరీక్షల్లో ఆమెకు 400 లకు 400 మార్కులు వచ్చినట్లుగా అందులో పేర్కొన్నారు. కనుక సన్నీకి వెంటనే మొదటి జాబితాలోనే సీటు వచ్చింది. అది కూడా ఆమె పేరు నెం.1 గా ఉంది. ఇంత చిత్రంగా సన్నీలియోన్‌ పేరు ఉండటంతో వెంటనే కాలేజ్‌ యాజమాన్యం స్పందించింది. ఎవరో గుర్తు తెలియని ఆకతాయిలు సన్నీలియోన్‌ పేరుతో దరకాస్తు చేశారు. ఎక్కువ మార్కులు ఇవ్వడంతో ఆమె పేరు ముందు వరుసలో వచ్చింది. ఆ పేరును తొలగించి ఈ ఘటనకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. మొత్తానికి సన్నీకి కాలేజ్‌ సీటు వచ్చినట్లే వచ్చి పోయిందే అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.