Begin typing your search above and press return to search.

ఆ సీన్ల షూట్ వేళ వారుంటే సన్నీ చేయదట

By:  Tupaki Desk   |   22 Oct 2022 4:40 AM GMT
ఆ సీన్ల షూట్ వేళ వారుంటే సన్నీ చేయదట
X
దేశీయ సినిమా రంగంలో సన్నీలియోన్ ఒక సంచలనం. అదెందుకు అన్నది అందరికీ తెలిసిందే. ఏ మాత్రం గౌరవప్రదం కాని అడల్ట్ మూవీల్లో నటిస్తూ.. గుర్తింపు పొందిన ఒక నటి.. ఆ కెరీర్ ను వదిలేయటం అంత తేలికైన విషయం కాదు.

ఒకవేళ సాహసించి అశ్లీల సినిమాల నుంచి బయటకు వచ్చేసినా.. మొయిన్ స్ట్రీమ్ మూవీల్లో చాన్సులు రావటం.. ప్రేక్షకుల్లో క్రేజ్ ను సొంతం చేసుకోవటం అంత ఈజీ కాదు. ఇలాంటి కఠిన పరీక్షలో పాస్ కావటమే కాదు.. పలు చిత్రాల్లో నటించే అవకాశాన్ని సొంతం చేసుకునే టాలెంట్ సన్నీ లియాన్ సొంతమని చెప్పాలి.

దాదాపు పదేళ్ల క్రితం అశ్లీల చిత్రాలకు గుడ్ బై చెప్పేసిన ఆమెకు అటు బాలీవుడ్ లోనే కాదు.. ఇటు ప్రాంతీయ భాషా చిత్రాల్లోనూ అవకాశాలు దండిగా వస్తూనే ఉన్నాయి. తెర మీద ఎలా కనిపించినా.. తెర వెనుక మాత్రం తనదైన తీరుతో తన గౌరవ మర్యాదల్ని పెంచుకోవటంలో సన్నీలియాన్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. తాజాగా ఆమె నటించిన జిన్నా సినిమా ఈ శుక్రవారం విడుదల కాగా.. ఆమె నటిస్తున్న మరో చిత్రం ''ఓ మై ఘోస్ట్'' మూవీ షూటింగ్ వేగంగా సాగుతోంది.

ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోను ఆమె సక్సెస్ ఫుల్ గా దూసుకెళుతున్నారు. భర్త డేనియల్ వైబర్ ను ప్రేమ వివాహం చేసుకొని.. సరగోసీ పద్ధతిలో ముగ్గురు పిల్లల (ఇద్దరు కవలలు) తల్లైన సన్నీ లియోన్.. వారితో వీలైనంత ఎక్కువగా గడపటం తెలిసిందే.

తాను నటించే చిత్రాల్లో గ్లామరస్ సీన్లలో నటించే విషయంలో సన్నీ విధించే కండీషన్లు చాలా స్పష్టంగా ఉంటాయని చెబుతారు. ఇదే విషయాన్ని తాజాగా ఆమె ఒక కార్యక్రమంలో షేర్ చేసుకున్నారు. తాను గ్లామరస్ పాత్రల్ని పోషించే చిత్రాల షూటింగ్ వేళలో.. పిల్లల ముందు తాను షూట్ కు ఒప్పుకోనని స్పష్టం చేశారు. అవసరమైతే షూటింగ్ కు నో చెబుతానే తప్పించి.. నటించే ప్రసక్తే లేదని తేల్చిన వైనం చూస్తే..సన్నీ ఆలోచనలకు ఫిదా కావాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.