Begin typing your search above and press return to search.

సన్నీకి మాత్రం ఎప్పడూ ఆ బాధే లేదట

By:  Tupaki Desk   |   26 Nov 2017 6:01 AM GMT
సన్నీకి మాత్రం ఎప్పడూ ఆ బాధే లేదట
X
ఈ ఏడాది మలయాళ హీరోయిన్ని కిడ్నాప్ చేసి.. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడిన నాటి నుంచి ఇండియాలో అన్ని సినీ పరిశ్రమల్లోనూ హీరోయిన్లు ఓపెన్ అవుతున్నారు. పరిశ్రమలో తమకు ఎదురవుతున్న చేదు అనుభవాల గురించి స్పందిస్తున్నారు. ఇటీవల హాలీవుడ్ నిర్మాత హార్వీ వీన్ స్టీన్ బాగోతం బయటపడ్డాక మరింతగా హీరోయిన్లు ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నారు.

ఎంతోమంది స్టార్ హీరోయిన్లు తమకు పరిశ్రమలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి ఓపెన్ అయ్యారు. ప్రియాంక చోప్రా లాంటి స్టార్ హీరోయిన్ కూడా తాను ఇబ్బంది పడిన విషయం చెప్పింది. ఐతే శృంగార తారగా ఒక వెలుగు వెలిగి.. ఆ తర్వాత బాలీవుడ్ కు వచ్చి సినిమాలు చేస్తున్న సన్నీ లియోన్ మాత్రం తనకు ఇండియాలో ఎక్కడా ఇలాంటి ఇబ్బందులు ఎదురవలేదని చెప్పడం విశేషం. ఈ విషయంలో తన భర్త నుంచి అందుతున్న తోడ్పాటు గొప్పదని ఆమె అంది.

‘‘నేను ఐదేళ్లుగా ఇండియాలో ఉంటన్నా. కానీ నాకు ఎప్పుడూ అలాంటి పరిస్థితులు ఎదురు కాలేదు. దేవుడి దయవల్ల నాకు ఎలాంటి చేదు అనుభవాలూ లేవు. కానీ అలాంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ల గురించి నాకు తెలుసు. నాతో ఎప్పుడూ నా భర్త డేనియల్ వెబర్ ఉంటాడు. ఎలాంటి చెత్తా లేకుండా చూసుకుంటాడు. అన్నింటినీ పరిహరించి.. నేను బాధపడకుండా చూసుకుంటాడు’’ అని సన్నీ చెప్పింది.