Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరిః మొగుడితో సన్నీ న్యూడ్ యాడ్

By:  Tupaki Desk   |   28 Nov 2017 1:24 PM GMT
ఫోటో స్టోరిః మొగుడితో సన్నీ న్యూడ్ యాడ్
X
ఇప్పుడేంటి ఈ టాపిక్ కొత్తగా చెబుతున్నారు.. ఆల్రెడీ మొగుడితో కలసి ఎప్పుడో పోర్న్ సినిమాలే చాలా చేసిందికదా అంటూ కొందరు చులకనగా కామెంట్ చేయొచ్చేమో కాని.. ఇప్పుడు మాత్రం భారత సంతతికి చెందిన కెనెడియన్ సన్ని లియోని.. తన భర్తతో కలసి ఒక యాడ్ కు న్యూడ్ గా ఫోజిచ్చింది. అయితే ఈసారి ఈ ఫోజులు తాలూకు పరమార్ధం పూర్తిగా వేరు.

అసలు పోర్న్ ప్రపంచం వదిలేసి.. ఇండియా వచ్చి.. ఇక్కడ సెక్సీ రోల్స్ చేసుకుంటూ.. ఇప్పుడు నటిగా తనను తాను ప్రూవ్ చేసుకుని.. పెద్ద పెద్ద హీరోల దగ్గర నుండి ఆఫర్లు పట్టేస్తూ.. ఏకంగా ఒక ఇండియన్ చిన్నారిని దత్తత తీసుకుని.. అసలు తానంటేనే చాలా డిఫరెంట్ అని ప్రూవ్ చేసింది సన్ని. అంతేకాకుండా.. ఇప్పుడు ఇండియాలోని చాలా బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉంటోంది. అదిగో ఇప్పుడు పెటా సంస్థ వారు చేపట్టే యాంటీ లెథర్ ఉత్పత్తుల క్యాంపెయిన్ కోసం.. భర్త డ్యానియల్ వెబర్ తో కలసి అలా ఫోజిచ్చింది. ఇక్కడ న్యూడిటి ఎందుకంటే.. జంతువులకు కూడా వాటి చర్మంలో అవి ఉంటేనే నచ్చుతుంది.. కాబట్టి జంతువులను చంపకండి అంటూ మెసేజ్ ఇవ్వడానికి.

క్రోకోడైల్ చర్మం.. ర్యాబిట్ చర్మం.. నక్క తోలు.. కుక్కుతోలు వంటి వాటితో తయారుచేసే కాస్ట్యూమ్స్ మరియు ఇతర ఉత్పత్తులను మానేసి.. సింథటిక్ లెదర్ వాడాలంటూ సన్నీ సూచిస్తోంది. జంతువుల చర్మాన్ని తీసి లెదర్ తయారుచేయడానికి వాటిని క్రూరంగా హింసించి.. తలబద్దలుకొట్టి చంపేసి.. వాటికి కరెంట్ షాక్ కూడా ఇస్తారని.. దయచేసి అలా చేయొద్దు అంటూ వేడుకుంటోంది.